కాపరికి కరోనా.. గొర్రెలు, మేకలు ఐసోలేషన్‌కి!

30 Jun, 2020 21:17 IST|Sakshi

బెంగళూరు: దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. కేసుల సంఖ్య రోజురోజుకూ పెరగడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. తాజాగా కర్ణాటకలోని తుముకూరు జిల్లాలోని ఓ గొర్రెల కాపరికి కరోనా వైరస్‌ పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో అతని వద్ద ఉన్న సుమారు 50 గొర్రెలు, మేకలను ఐసోలేషన్‌కు తరలించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటన గొల్లరహట్టి తాలూకాలోని గోడెకెరె గ్రామంలో చోటుచేసుకుంది. కాపరికి చెందిన మేకలు, గొర్రెలు శ్వాసకోశ సమస్య కలిగి ఉన్నాయని గమనించిన గ్రామ ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారని పశుసంవర్ధక శాఖలోని ఓ అధికారి తెలిపారు. (తెలంగాణలో కొత్తగా 945 కరోనా కేసులు)

అదే విధంగా గోడెకెరె గ్రామ ప్రజలు తమ గ్రామంలో నెలకొన్న కరోనా భయాందోళనలపై సమగ్రంగా విచారణ జరపాలని కర్ణాటక న్యాయశాఖ మంత్రి మధుస్వామి, తుముకూరు జిల్లా కమిషనర్‌ కె. రాకేష్‌ కుమార్‌కు విజ్ఞప్తి చేశారు. దీంతో ప్రజల విజ్ఞప్తిపై మంత్రి స్పందించారు. గ్రామంలోని పరిస్థితులను తెలుసుకోవాలని పశుసంవర్ధక విభాగాన్ని ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన వైద్యులు.. పలు పరీక్షలు నిర్వహించి.. మేకలు ప్లేగు, మైకోప్లాస్మా ఇన్‌ఫెక్షన్ అని పిలువబడే పెస్టే డెస్ పెటిట్స్ రూమినెంట్స్(పీపీఆర్)తో బాధపడుతున్నాయని తెలిపారు. ఇక జంతువుల నుంచి సేకరించిన నమూనాలను భోపాల్‌లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ యానిమల్ హెల్త్ అండ్ వెటర్నరీ బయోలాజికల్స్, వెటర్నరీ లాబొరేటరీకి పంపినట్లు వెల్లడించారు. ఇక మేకలు, గొర్రెలు కరోనాకు గురి కాలేదని వైద్యులు స్పష్టం చేశారు. కానీ ప్లేగు, మైకోప్లాస్మా ఇన్‌ఫెక్షన్ ఇతర జంతువులకు కూడా వ్యాప్తిస్తుందని గొర్రెలు, మేకలను నిర్భంధించినట్లు అధికారులు తెలిపారు.(తమిళనాడు మంత్రికి కరోనా పాజిటివ్‌)

మరిన్ని వార్తలు