'కరెన్సీ నోట్లపై లక్ష్మీదేవి బొమ్మ ముద్రిస్తే మేలు'

16 Jan, 2020 06:54 IST|Sakshi

న్యూఢిల్లీ: భారతీయ కరెన్సీ నోట్లపై లక్ష్మీదేవి బొమ్మను ముద్రించడం వల్ల మేలు జరుగుతుదని బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యం స్వామి చెప్పారు. ఈ సందర్భంగా ఇండోనేషియా కరెన్సీ నోట్లపై గణేశుని బొమ్మను ముద్రించిన విషయాన్ని ప్రస్తావించారు. మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వాలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇండోనేషియా కరెన్సీపై గణేశుని బొమ్మ ముద్రించడాన్ని విలేకరులు ఆయన వద్ద ప్రస్తావించినపుడు స్వామి మాట్లాడుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలన్నారు.

తాను దీనికి అనుకూలంగా ఉన్నట్లు తెలిపారు. గణేశుడు విఘ్నాలను తొలగిస్తాడని చెప్పారు. లక్ష్మీదేవి బొమ్మను కరెన్సీ నోట్లపై ముద్రిస్తే, భారతీయ కరెన్సీ పరిస్థితిని మెరుగుపడవచ్చునని చెప్పారు. దీని గురించి ఎవరూ చెడుగా అనుకోవాల్సిన అవసరం లేదన్నారు.

చదవండి: ‘టీటీడీపై దుష్ప్రచారం చేస్తే పరువునష్టం దావా’

>
మరిన్ని వార్తలు