ఉడిపిలో రంగుల పాము ప్రత్యక్షం

31 Mar, 2019 13:13 IST|Sakshi

సాక్షి, బెంగళూరు : కర్ణాటకలో అరుదైన పాము ఉడిపి జిల్లా మల్పెలో కనిపించాయి. గత కొద్దిరోజులుగా అడవుల్లో ఉండే పాములు నగరంలోకి రావడం ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే ఉడిపికి సమీపంలోని మల్పెలో ఓ హోటల్‌లో అనుకోకుండా రంగురంగుల పాము దర్శనమిచ్చింది. హోటల్‌ యజమాని తెచ్చిన కూరగాయల బుట్టలో ఇది ప్రత్యక్షం అయింది. ఆ పాము  శరీరంపై ఎరుపు, నలుపు, తెలుపు మచ్చలున్నాయి. కాగా ఒటికన్నర మీటరు పొడవున్న ఈ పాము విషపూరితం కాదని, వీటిని స్థానికులు గోల్డెన్‌ ట్రీ స్నేక్‌  (కైసోపెలియా ఆర్నెట్‌)గా పిలుస్తారని, పాముల పరిశోధకుడు గురురాజ్‌ తెలిపారు. ఈ పాములు చెట్ల తొర్రల్లో జీవిస్తుంటాయని ఆయన పేర్కొన్నారు. ఈ పామును చూసేందుకు స్థానికులు తరలి వచ్చారు. అనంతరం దాన్ని సురక్షితంగా అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు.

మరిన్ని వార్తలు