భారతీయ బాలుడికి గూగుల్ అవార్డు

20 Jul, 2016 09:01 IST|Sakshi
భారతీయ బాలుడికి గూగుల్ అవార్డు

న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక ‘గూగుల్ కమ్యూనిటీ ఇంపాక్ట్’ అవార్డు తమిళనాడు రాజధాని చెన్నైకి చెందిన అద్వయ్ రమేశ్ అనే 14 ఏళ్ల బాలుడిని వరించింది. మత్స్యకారుల భద్రతకు ఉపకరించే ‘ఫిషర్‌మెన్ లైఫ్‌లైన్ టెర్మినల్’ అనే పరికరాన్ని తయారు చేసినందుకుగాను ఆసియా దేశాల నుంచి గూగుల్ ఇండియా సదరు బాలుణ్ని ఈ అవార్డుకు ఎంపిక చేసింది. ఈ పరికరం జీపీఎస్ సాయంతో పనిచేస్తుంది.

ఈ అవార్డు కింద 50వేల డాలర్లు (రూ. 33 లక్షల 57 వేలు) స్కాలర్‌షిప్‌ను గూగుల్ అందజేయ నుంది. ఆసియా విభాగంలో ఫైనల్లో  20 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. రమేశ్ రూపొందించిన పరికరం ఫైనల్లో ఉత్తమమైనదిగా ఎంపికవడం విశేషం. సముద్రంలో మత్స్యకారులు పడుతున్న ఇబ్బందులకు పరిష్కారం కనుగొనాలనే లక్ష్యంతో తాను ఈ  పరికరాన్ని రూపొందించినట్లు రమేశ్ వెల్లడించాడు. ఈ కాంటెస్ట్‌లో మొత్తం 107 దేశాల విద్యార్థులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు