తెలుగులో గూగుల్‌ ‘సేఫ్టీ సెంటర్‌’ సేవలు

15 Nov, 2018 03:01 IST|Sakshi

న్యూఢిల్లీ: వ్యక్తిగత సమాచారంపై వినియోగదారులకు మరింత నియంత్రణ కల్పించేందుకు గూగుల్‌ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ‘సేఫ్టీ సెంటర్‌’ పరిధిని విస్తరిస్తూ  తెలుగు, హిందీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, తమిళం, మలయాళం, మరాఠి, ఉర్దూ భాషల్లో సేవలందించనుంది. తమ సమాచారాన్ని గూగుల్‌ ఎలా వాడుకోవచ్చో వినియోగదారులు ప్రాథమ్యాల ప్రాతిపదికగా అనుమతిచ్చే వేదికగా సేఫ్టీసెంటర్‌ పనిచేస్తుంది. ‘గూగుల్‌ పౌరుల డేటాను అమ్ముకుంటోందన్న వాదనలు తప్పని సేఫ్టీ సెంటర్ల ద్వారా నిరూపించాం. గూగుల్‌ ఎందుకు, ఎలాంటి డేటాను సేకరిస్తోంది? డేటాను ఎలా వినియోగిస్తోంది? లాంటి విషయాల్ని వివరించాం. యూజర్‌ పేరు, పుట్టిన తేదీ, లొకేషన్, బ్రౌజింగ్‌ చరిత్ర తదితరాలను గూగుల్‌తో పంచుకోవడం ఇష్టం లేకపోతే అలాంటి సమాచారాన్ని డిలీట్‌ చేసుకోవచ్చు’ అని సంస్థ తెలిపింది.

మరిన్ని వార్తలు