గోర్‌ఖ్‌పూర్‌, పూల్‌పూర్‌లో బీజేపీ వెనుకంజ

14 Mar, 2018 09:44 IST|Sakshi

గోరఖ్‌పూర్‌, పూల్‌పూర్‌లో ఆధిక్యం దిశగా ఎస్‌పీ

  • పూల్‌పూర్‌లో 22,842 ఓట్ల ఆధిక్యంలో ఎస్‌పీ
  • గోరఖ్‌పూర్‌లో బీజేపీ వెనుకంజ. 1523 ఓట్ల ఆధిక్యంలో ఎస్‌పీ
  • బబువా అసెంబ్లీలో 40,510 ఓట్లతో బీజేపీ లీడింగ్‌
  • జహనాబాద్‌లో 50,609 ఓట్లతో ఆర్‌జేడీ ముందంజ
  • అరారియా లోక్‌సభ స్థానంలో 23,187  ఓట్ల ఆధిక్యంలో ఆర్‌జేడీ

గోరఖ్‌పూర్‌: ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌, పూల్‌పూర్‌  ఉప ఎన్నికల ఫలితాలు మరికొద్ది సేపట్లో విడుదల కానున్నాయి. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాధ్‌ సొంత నియోజకవర్గం కావడంతో దేశం మొత్తం ఫలితాల కోసం ఎంతో ఉ‍త్కంఠంగా ఎదురుచూస్తోంది. విజయం మీద అధికార బీజేపీ, ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీలు ధీమాతో ఉన్నాయి. గోర్‌ఖ్‌పూర్‌ బీజేపీకి కంచుకోట కాగా, పూల్‌పూర్‌లో కూడా తమ అభ్యర్ధి విజయం సాధిస్తారని యోగి ఆశాభావం వ్యక్తం చేశారు. గోరఖ్‌పూర్‌లో బీజేపీ అభ్యర్ధిగా ఉపేంద్ర దత్‌ శుక్లా పోటీ చేయగా, ఆయనపై ఎస్‌పీ, బీఎస్‌పీ కూటమి నుంచి ప్రవీణ్‌ నిషాద్‌ బరిలో ఉన్నారు.

కాగా గోరఖ్‌పూర్‌లో బీజేపీ 1991 నుంచి ఇప్పటి వరకూ ఒక్కసారి కూడా ఓటమి చెందకపోవడం విశేషం. 2014లో ఇక్కడి నుంచి గెలిచిన ఆదిత్యానాధ్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగా, పూల్‌పూర్‌లో నుంచి  గెలిచిన కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య  రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఎన్నికవ్వడంతో  ఈ నెల 4వ తేదీన ఈ రెండు నియోజకవర్గాల్లో ఉప ఎన్నిక జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఇక్కడి నుంచి 1998,1999,2004,2009,2014 వరుస ఎన్నికల్లో ఐదుసార్లు విజయం సాధించారు. ఇక ఈ ఎన్నికల్లో గెలిస్తే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో  బీజేపీకి గట్టిపోటీ ఇవ్వచ్చని ప్రతిపక్షాలు ఉప ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా  తీసుకున్నాయి.

ఇక బిహార్‌లోని అరారియా లోక్‌ సభ స్థానంతోపాటు రెండు అసెంబ్లీ సీట్లకు కూడా పోలింగ్‌ జరిగింది. మహాకూటమి నుంచి నితీశ్‌ బయటికి వచ్చాక జరుగుతున్న తొలి ఎన్నికలు కావటంతో ఆసక్తి నెలకొంది. సార్వత్రిక ఎన్నికలకు ముందు జరుగుతున్న ఎన్నికలు కావటంతో ఈ రెండు రాష్ట్రాల ఉప ఎన్నికలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి.

మరిన్ని వార్తలు