ఈ ఉద్యోగులకూ వేతన పెంపు ప్రయోజనాలు

15 Jan, 2019 19:51 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఏడవ వేతన సంఘం ప్రయోజనాలను ఉపాధ్యాయులు, రాష్ట్ర ప్రభుత్వ అకడమిక్‌ స్టాఫ్‌, ప్రభుత్వ ఎయిడెడ్‌ సాంకేతిక విద్యాసంస్ధల ఉద్యోగులకూ వర్తింపచేయాలనే ప్రతిపాదనను మంగళవారం కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ఈ నిర్ణయంతో కేంద్ర ప్రభుత్వంపై రూ 1241.78 కోట్ల అదనపు భారం పడనుంది.

ఏడవ వేతన సంఘం సిఫార్సులకు అనుగుణంగా పెరిగిన వేతన బకాయిలను ఆయా సంస్థలకు కేంద్రం రీఎంబర్స్‌ చేయనుంది. మరోవైపు ఫిబ్రవరి 1న మోదీ సర్కార్‌ ప్రవేశపెట్టనున్న తాత్కాలిక బడ్జెట్‌లో వేతన పెంపుపై 50 లక్షల మందికి పైగా ఉద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

ఎన్నికల ఏడాది కావడంతో వేతన పెంపు దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కనీస వేతనం రూ 18,000ను రూ 26,000కు పెంచాలని ఉద్యోగ సంఘాలు దీర్ఘకాలంగా డిమాండ్‌ చేస్తున్నాయి. ఫిట్‌మెంట్‌ను సైతం ప్రస్తుతమున్న 2.57 రెట్ల నుంచి 3.68 రెట్లకు పెంచాలని పట్టుబడుతున్నాయి.

మరిన్ని వార్తలు