‘అంటే.. అసలు దర్యాప్తే జరగొద్దనా అర్ధం’

7 Jul, 2017 17:28 IST|Sakshi
‘అంటే.. అసలు దర్యాప్తే జరగొద్దనా అర్ధం’

న్యూఢిల్లీ: బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ ఇంటిపై సీబీఐ దాడులకు తమ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. తనకు నిర్దేశించిన చట్టానికి లోబడి కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) బాధ్యతలు నిర్వర్తిస్తోందని తెలిపారు. ‘రాజకీయ కక్ష సాధింపు అంటే ఏమిటి? ఇందులో బీజేపీ ఎక్కడ ఉంది? అసలు ఈ విషయం నాకు అర్థం కావడం లేదు. ఎవరూ ఏ తప్పు చేసినా వారిపై విచారణ చేయకూడదని చెప్పడమేనే మీరు చెప్పేదాని అర్ధం.. మొత్తానికి దర్యాప్తే జరగొద్దని అంటారా? అని వెంకయ్యనాయుడు విలేకరులను ప్రశ్నించారు.

‘సీబీఐ తన విధుల్ని తాను నిర్వర్తిస్తోంది. ఇప్పడు తనకు సరిగ్గా పనిచేసే అవకాశం ఉంది. గతంలో అలాంటి పరిస్థితి లేదు.. మా ప్రభుత్వం వచ్చాకే సీబీఐ చేస్తున్న పనుల్లో జోక్యం చేసుకోవడం లేదు. అందుకే సీబీఐ స్వేచ్ఛగా పనిచేస్తోంది.. చట్టం ప్రకారం తనకు నిర్దేశించిన బాధ్యతలను నిర్వర్తిస్తోంది’ అని అన్నారు. శుక్రవారం ఉదయం 7గంటల ప్రాంతంలోనే లాలూ కుటుంబం, ఆయనకు చెందిన 12 ప్రాంతాలపై సీబీఐ ఏకకాలంలో దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. ఇందులో కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపు ఉందని పలువురు ఆరోపించిన నేపథ్యంలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఇలా స్పందించారు.

మరిన్ని వార్తలు