ఒడిశాపై మిడతల దాడి?

3 Jun, 2020 04:13 IST|Sakshi

9 జిల్లాలను అప్రమత్తం చేసిన ప్రభుత్వం

భువనేశ్వర్‌/నాగ్‌పూర్‌: మిడతలు దాడి చేసే అవకాశం ఉండటంతో ఒడిశాలోని తొమ్మిది జిల్లాల్లోని రైతులను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ఆంధ్రప్రదేశ్, చత్తీస్‌గఢ్, జార్ఖండ్‌ సరిహద్దుల్లోని ఈ జిల్లాల్లో మిడతల దాడికి అవకాశం ఉందనీ, పొరుగు రాష్ట్రాలతో సమన్వయం చేసుకుంటూ పరిస్థితిని సమీక్షిస్తున్నామని తెలిపింది. మిడతల దండుపై కీటకనాశినులను పిచికారీ చేసేందుకు టెండర్లు పిలవాలని కూడా ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన సమావేశం నిర్ణయించింది.  సోమవారమే పొరుగున ఉన్న చత్తీస్‌గఢ్‌లోకి మిడతలు ప్రవేశించిన నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది.

డ్రోన్లతో మందుల పిచికారీ
పంటలకు తీవ్ర నష్టం కలిగించే మిడతలను ఎదుర్కొనేందుకు డ్రోన్లను ఉపయోగించాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కీటక నాశినులను డ్రోన్లతో పిచికారీ చేయనున్నట్లు వ్యవసాయ మంత్రి దాదా భుసే తెలిపారు. నాగ్‌పూర్‌ జిల్లాలోని భేటీసుర్లా ప్రాంతంలో మిడతలను గుర్తించి, 500 లీటర్ల కీటకనాశినులను పిచికారీ చేయించామని చెప్పారు.రానున్న శుక్రవారం నుంచి డ్రోన్ల సాయంతో మందులను పిచికారీ చేస్తామన్నారు. గత నెల 25న విదర్భలోని నాగ్‌పూర్‌ ప్రాంతంలో లక్షల సంఖ్యలో మిడతలు పంటపొలాలపై దాడి చేసిన విషయం తెలిసిందే.

>
మరిన్ని వార్తలు