కాలేజ్‌ల్లో మొబైల్స్‌పై నిషేధం విధించలేదు

23 Oct, 2019 16:18 IST|Sakshi

లక్నో : యూనివర్సిటీలు, కాలేజ్‌ల్లో మొబైల్స్‌ ఫోన్ల వాడకంపై ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం నిషేధం విధించిందనే వార్తలు గత వారం రోజులుగా ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఆ వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని తేలింది. తాము విద్యాసంస్థల్లో మొబైల్స్‌ వాడకంపై ఎటువంటి నిషేధం విధించలేదని యూపీ ఉన్నత విద్యాశాఖ తెలిపింది. మొబైల్స్‌ వాడకంపై నిషేధం విధించినట్టు వచ్చిన వార్తలో ఏ మాత్రం నిజం లేదని ఆ శాఖ డైరక్టర్‌ వందన శర్మ  స్పష్టం చేశారు. తాము అలాంటి సర్క్యులర్‌ జారీ చేయలేదని వెల్లడించారు. ఈ వార్తలను యూపీ డిప్యూటీ సీఎం దినేశ్‌ శర్మ కూడా ఖండించారు. 

కాగా, యూపీ ప్రభుత్వం కాలేజ్‌లు, యూనివర్సిటీల పరిసరాల్లో మొబైల్‌ ఫోన్ల వాడకంపై నిషేధం విధిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. ప్రముఖ  మీడియా సంస్థలు, మీడియా ఏజెన్సీలు కూడా దీనిపై కథనాలు ప్రచురించాయి.  అంతేకాకుండా సోషల్‌ మీడియలో ఈ అంశం విస్తృతంగా ప్రచారం జరిగింది. సంచలన నిర్ణయాలకు కేరాఫ్‌గా నిలిచే యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌  నిజంగానే విద్యాసంస్థలో మొబైల్స్‌ ఫోన్ల వాడకంపై నిషేధం విధించారని అంతా భావించారు. అయితే తాజాగా అందులో ఏ మాత్రం నిజం లేదని.. తప్పుడు వార్త అని తేలింది.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

చేతకాకపోతే ఇంట్లో కూర్చోండి: కిషన్‌రెడ్డి 

దీప యజ్ఞం సక్సెస్‌

దేశవ్యాప్తంగా దిగ్విజయమైన 'దియా జలావొ'

ఒక్కరోజులో 6.5 లక్షల మందికి ఆహారం

‘క్రమశిక్షణతోనే మహమ్మారి కట్టడి’

సినిమా

తారా దీపం

ఇప్పట్లో పెళ్లి ఆలోచన లేదు

పేద సినీ కార్మికులకు సహాయం

మహేష్‌ మేనల్లుడు అశోక్‌ లుక్‌ రివీల్‌..

బన్నీ బర్త్‌ డే.. ముందే సర్‌ప్రైజ్‌ ఇచ్చిన దేవీశ్రీ

కోడలికి కృతజ్ఞతలు తెలిపిన మెగాస్టార్‌