మోదీ 2.0 : యాభై రోజుల పాలన ఇలా..

22 Jul, 2019 15:53 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కేంద్రంలో తిరిగి రెండోసారి పాలనా పగ్గాలు చేపట్టిన అనంతరం మోదీ సర్కార్‌ తొలి 50 రోజుల్లో సుపరిపాలనను పరుగులు పెట్టించేలా పునాదులు వేసిందని ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం స్పష్టం చేసింది. కేంద్ర మంత్రి ప్రకాష్‌ జవదేకర్‌ సోమవారం మీడియా ప్రతినిధుల ఎదుట ప్రభుత్వం సాధించిన పురోగతిని వివరిస్తూ రిపోర్ట్‌ కార్డ్‌ను సమర్పించారు. సబ్‌కా సాథ్‌..సబ్‌కా వికాస్‌..సబ్‌కా విశ్వాస్‌ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని చెప్పారు. దేశంలోని ప్రతి ఒక్కరికి సంక్షేమం..సమన్యాయం అందేలా చేయడమే ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు.

దేశంలో పెట్టుబడులను ముమ్మరం చేసేందుకు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం పలు చర్యలు చేపట్టిందని మంత్రి వెల్లడించారు. రానున్న ఐదేళ్లలో మౌలిక వసతుల అభివృద్ధి కోసం రూ 100 లక్షల కోట్లు వెచ్చిస్తామని చెప్పారు. భారత్‌ను 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్ధగా మలిచేందుకు అవసరమైన రోడ్‌మ్యాప్‌ను ఈ 50 రోజుల్లో రూపొందించామని అన్నారు. 50 రోజుల పాలనలో ప్రభుత్వ రంగ బ్యాంకుల బలోపేతం కోసం వాటికి మూలధనం కింద రూ 70,000 కోట్లు కేటాయించడం ప్రభుత్వ విజయంగా చెప్పుకొచ్చారు.

జమ్మూ కశ్మీర్‌లో వేర్పాటువాదుల ప్రభావాన్ని తగ్గించగలిగామని తెలిపారు. బిమ్స్‌టెక్‌, జీ-20 సదస్సుల ద్వారా భారత్‌ గ్లోబల్‌ లీడర్‌గా అవతరించిందని అన్నారు. అధికార యంత్రాగంలో అవినీతిపై, ఆర్థిక నేరగాళ్లపై చర్యలు, పోక్సో చట్టానికి సవరణలు వంటి పలు విజయాలు సాధించామని మంత్రి చెప్పారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

సాధ్విని మందలించిన జేపీ నడ్డా!

‘బీజేపీ నా భర్తను వేధిస్తోంది’

వచ్చే 24 గంటలు కీలకం: ఇస్రో చైర్మన్‌

జాబిలమ్మ మీదకు దూసుకెళ్లిన చంద్రయాన్‌–2

ఎన్నారై అనుమానాస్పద మృతి

ఇక పట్టాల పైకి దేశీ రైళ్లు

అశ్లీల చిత్రాలు చూపిస్తూ తండ్రి కొడుకు..

‘24 గంటల్లోనే కాంగ్రెస్‌లో చీలిక’

కైరానా ఎమ్మెల్యే ​వ్యాఖ్యలతో హైరానా..

ప్రజా ఉద్యమానికి దిగిరావాల్సిందే!

క్లైమాక్స్‌కు చేరిన కర్ణాటక రాజకీయం

మూడు నెలల్లో ఒక్క ఆడ శిశువు కూడా..

జాబిలమ్మ మీదకు చంద్రయాన్‌–2 

‘షీలా దీక్షిత్‌లానే మిమ్మల్ని గుర్తు చేసుకుంటారు’

టాయిలెట్లు శుభ్రం చేయాలా: ఎంపీ ఆగ్రహం

వెనిస్‌ వాకిట్లో బాంబే రోజ్‌

ఏకకాలంలో రెండు డిగ్రీలు

సీపీఐ పగ్గాలు అందుకున్న రాజా

షీలాకు కన్నీటి వీడ్కోలు

ప్రతిపక్ష ఎంపీలపై బీజేపీ వల!

కర్నాటకంలో కాంగ్రెస్‌ సీఎం!

2 కోట్లు.. ఓ పెట్రోల్‌ బంకు

‘చంద్రయాన్-2’ కౌంట్ డౌన్ షురూ

ఈనాటి ముఖ్యాంశాలు

కేంద్ర మంత్రి ఇంట్లో విషాదం..

సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా డి.రాజా

ముగిసిన షీలా దీక్షిత్‌ అంత్యక్రియలు

ట‘మోత’  కేజీ రూ. 80

ముంబైలో భారీ అగ్నిప్రమాదం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఆగస్ట్ 15న దండుపాళ్యం 4

యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘22’ షురూ..

రూ 100 కోట్ల క్లబ్‌లో సూపర్‌ 30

‘సైరా’దర్శకుడు మెచ్చిన ‘మథనం’

దుమ్ము రేపనున్న ‘సాహో’ క్లైమాక్స్‌!

బిగ్‌బాస్‌ ట్రెండింగ్‌పై నాగార్జున ట్వీట్‌