అమల్లోకి వేతన చట్టం

24 Aug, 2019 11:59 IST|Sakshi

న్యూఢిల్లీ: జాతీయ స్థాయిలో 50 కోట్ల మందికి కనీస వేతనం అందేలా కేంద్రం తీసుకొచ్చిన ‘వేతనాల చట్టం– 2019’ అమల్లోకి వచ్చింది. గత పార్లమెంటు సమావేశాల్లో జూలై 30న లోక్‌సభ, ఆగస్టు 2న రాజ్యసభ ఈ బిల్లును ఆమోదించాయి. ఆగస్టు 8న రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ కూడా ఈ బిల్లును ఆమోదించటంతో చట్టంగా మారింది. ఈ మేరకు కేంద్రం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. కనీస వేతనాలు, బోనస్‌లు, సమాన వేతనాలు వంటి నిబంధనలు కలిగిన నాలుగు చట్టాల స్థానంలో దీన్ని తీసుకొచ్చారు.

ఈ చట్టం ప్రకారం వర్తక సంఘాలు, ఉద్యోగులు, రాష్ట్రప్రభుత్వం ఆధ్వర్యంలో వేతనాలు నిర్ణయమవుతాయి. వివక్షకు తావు లేకుండా పురుషులతో సమానంగా మహిళలు, ట్రాన్‌జెండర్స్‌ వేతనాలు పొందేందుకు కొత్త చట్టం వీలు కల్పిస్తుంది. వేతన పరిమితితో పనిలేకుండా అన్ని రంగాల కార్మికులకూ కనీస వేతనం సకాలంలో అందేలా నిబంధనలను ఇందులో పొందుపరిచారు.

మరిన్ని వార్తలు