ఉపాధి కల్పనే లక్ష్యంగా యూపీలో కమిషన్‌

25 May, 2020 18:06 IST|Sakshi

లక్నో: వలస కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు ఉత్తర్‌ ప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతున్న నేపథ్యంలో వలస కార్మికులు ఉపాధి కోల్పొయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కార్మికులకు ఉపాధి కల్పించే ఉద్దేశ్యంతో మైగ్రేషన్‌ కమీషన్‌ను నియమించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దాదాపు 23లక్షల మంది వలస కార్మికులు వివిద రాష్ట్రాలు నుంచి యూపీకి వచ్చారని అధికారులు తెలిపారు. వలస కార్మికులకు ఇన్సురెన్స్‌ కల్పించాలని ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యానాథ్‌ ఆదేశించినట్లు అదనపు ప్రధాన కార్యదర్శి అవానిష్‌ అవాస్తి పేర్కొన్నారు. కార్మికులకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు.

యోగీ ఆదిత్యానాథ్‌ ఓ సమావేశంలో మాట్లాడుతూ.. కార్మికులే దేశ అభివృద్ధిలో ముఖ్య పాత్ర పోషిస్తారని.. కానీ దురదృష్టవశాత్తు కొన్ని రాష్ట్రాలు వలస కార్మికులను విస్మరించారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో ఏ రాష్ట్రమైనా తమ కార్మకుల సేవలు వినియోగించుకోవాలంటే ప్రభుత్వ అనుమతి తీసుకోవాలని పేర్కొన్నారు. కార్మికుల నైపుణ్య రంగాలను గుర్తించాలని అధికారులకు సూచించారు. వారి క్వారంటైన్‌ సమయం అయిపోయిన వెంటనే వారి ఉపాధి కల్పనకు చర్యలు తీసుకోవాలని యోగా ఆదిత్యానాథ్‌ ఆదేశించారు. 

>
మరిన్ని వార్తలు