భారీ ఊరట : వారి నుంచి వైరస్‌ సోకదు..

27 Apr, 2020 17:52 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి విస్తృత వ్యాప్తి నేపథ్యంలో సానుకూల పరిణామం చోటుచేసుకుంది. గతంలో కోవిడ్‌-19 పాజిటివ్‌ కేసులు వెలుగుచూసిన 16 జిల్లాల్లో గత 28 రోజులుగా తాజా కేసులు నమోదు కాలేదని అధికారులు వెల్లడించారు. గోండియా (మహారాష్ట్ర), దావణగెరే (కర్ణాటక), లఖి సరై (బిహార్‌) జిల్లాలు తాజాగా ఈ జాబితాలో చేరాయని పేర్కొన్నారు. కరోనా వైరస్‌ సోకి కోలుకున్న వారి నుంచి వైరస్‌ వ్యాప్తి చెందదనే సంకేతాలు దీనిద్వారా వెల్లడయ్యాయని నిపుణులు చెబుతున్నారు. ఇక 14 రోజులుగా దాదాపు మరో 85 జిల్లాల్లో కొత్తగా కోవిడ్‌-19 కేసులేవీ నమోదు కాలేదని అధికారులు వెల్లడించారు.

విస్తృత ప్రచారం ద్వారా కోవిడ్‌-19 రోగుల పట్ల వివక్షను దూరం చేసేలా చర్యలు చేపట్టాలని అధికారులు తెలిపారు. కోవిడ్‌-19 బారినపడి కోలుకున్న రోగుల నుంచి వైరస్‌ ఇతరులకు వ్యాప్తి చెందే ముప్పు లేదని మనం అర్ధం చేసుకోవాలన్నారు. ప్లాస్మా థెరపీ ద్వారా ఈ వ్యాధిని నయం చేసేందుకు వారు ఉపయోగపడతారని తెలుసుకోవాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ చెప్పారు. ఈ వైరస్‌ వ్యాప్తికి ఏ వర్గం లేదా ప్రాంతాన్ని నిందించడం తగదని, ఆరోగ్య..పారిశుద్ధ్య కార్మికులను లక్ష్యంగా చేసుకోరాదని అన్నారు.

చదవండి : చైనా ర్యాపిడ్‌ టెస్ట్‌ కిట్లు వాడొద్దు : ఐసీఎంఆర్‌

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు