ఐఐటీ పేద విద్యార్థులకు శుభవార్త

18 May, 2016 20:25 IST|Sakshi
ఐఐటీ పేద విద్యార్థులకు శుభవార్త

న్యూఢిల్లీ: లక్షల రూపాయలు కుమ్మరించి ఐఐటీ కోచింగ్ లకు వెళ్లలేని పేద విద్యార్థులకు శుభవార్త. ఐఐటీకి ప్రిపేరయ్యే వారికోసం త్వరలోనే ఒక ఆప్, పోర్టల్ ను రూపొందించనున్నట్టు కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ తెలిపారు. ఎడ్యుకేషన్ ప్రైవేటు సొసైటీ ఫర్ ఇండియా(ఈపీఎస్ఎఫ్ఐ) కార్యక్రమంలో పాల్గొన్న ఈ సమాచారం వెల్లడించారు. ఐఐటీ ఉపాధ్యాయుల పాఠాలు, గత పరీక్ష ప్రశ్నా పత్రాలను ఈ యాప్ లో అందుబాటులో ఉంచనున్నట్లు చెప్పారు.  ఐఐటీ ప్రవేశ పరీక్ష ప్రశ్నలను ఇంటర్ స్థాయికి పరిమితం చేయాలని నిర్ణయించినట్టు ఆమె వెల్లడించారు. వ్యాపారంగా మారిపోయిన విద్యను పేద విద్యార్థులకు అందుబాటు లోకి తేవడమే తమ శాఖ ధ్యేయమని స్పష్టం చేశారు.

కోచింగ్ సంస్థలు విద్యార్థులకు కీడు చేస్తున్నాయని, వారిపై ఒత్తిడి పెంచుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.  రెండు నెలల్లో పోర్టల్, ఆప్ ను విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఇందులో 50 ఏళ్ల ఐఐటీ ప్రశ్నా పత్రాలను అందుబాటులో ఉంచనున్నామని తెలిపారు. వీటికి ప్రత్యేకంగా డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదని అన్నారు. 13 ప్రాంతీయ భాషల్లోనూ సమాచారం ఉంటుందని చెప్పారు.

మరిన్ని వార్తలు