ఏడాది చివరికల్లా ఓబీసీ సంపన్నశ్రేణిపై సమీక్ష

1 Sep, 2016 12:31 IST|Sakshi

న్యూఢిల్లీ: ఈ ఏడాది చివరికల్లా ఓబీసీ సంపన్నశ్రేణి (క్రిమిలేయర్) విధానాన్ని కేంద్రం సమీక్షిస్తుందని కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత మంత్రి థావర్‌చంద్ గెహ్లాట్ చెప్పారు. ఓబీసీల్లో కుటుంబాదాయం ఏడాదికి రూ.6 లక్షలకు మించి ఉన్నవారిని ప్రస్తుతం సంపన్నవర్గంగా పరిగణిస్తున్నారు. వీరికి విద్య, ఉద్యోగాల్లో ఓబీసీ రిజర్వేషన్లు వర్తించవు.

ఈ ఏడాది చివరికల్లా నిర్వచనాన్ని మరోసారి సమీక్షిస్తామని మంత్రి తెలిపారు. ఈ సమీక్షలో ఆదాయ పరిమితిని రూ.8 లక్షలకు పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది.

మరిన్ని వార్తలు