అధిక ధరలకు విక్రయిస్తే భారీ జరిమానా

8 May, 2020 15:50 IST|Sakshi

మూడుసార్లు పట్టుబడితే లైసెన్స్‌ రద్దు

లక్నో : మద్యం వ్యాపారులు అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నారనే ఫిర్యాదులపై యూపీ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఎంఆర్‌పీ కంటే అధికంగా మద్యం విక్రయించే వ్యాపారులపై కఠిన చర్యలు చేపడతామని రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరించింది. నిర్ధేశిత ఎంఆర్‌పీపై ఎట్టిపరిస్థితుల్లోనూ అధిక ధరలకు విక్రయించరాదని ఎక్సైజ్‌ మంత్రి రాంనరేష్‌ అగ్రిహోత్రి ఆదేశించారు. ఈ మేరకు కఠిన ఉత్తర్వులు జారీ చేశామని, మద్యం కొనుగోలు చేసేవారు బాటిల్స్‌పై ముద్రించిన ఎంఆర్‌పీ పరిశీలించాకే నగదు చెల్లించాలని..అంతకుమించి మద్యం విక్రేతకు చెల్లించవద్దని ప్రిన్సిపల్‌ కార్యదర్శి (ఎక్సైజ్‌) సంజయ్‌ తెలిపారు.

మద్యం వ్యాపారులు అధిక ధరలకు విక్రయిస్తూ తొలిసారి పట్టుబడితే రూ 75,000 రెండోసారి పట్టుబడితే రూ 1.5 లక్షల జరిమానా విధిస్తామని, మూడోసారి ఇదే నేరానికి పాల్పడితే వారి లైసెన్స్‌ను రద్దు చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వ ఉత్తర్వులను కఠినంగా అమలు చేయాలని ఎక్సైజ్‌ కమిషనర్‌ జిల్లా, క్షేత్రస్ధాయి అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

చదవండి : మద్యం అమ్మకాలు; మండిపడ్డ మహిళలు

మరిన్ని వార్తలు