డజను ప్రభుత్వ వెబ్‌సైట్లపై సైబర్‌ దాడి!

7 Apr, 2018 03:18 IST|Sakshi

న్యూఢిల్లీ: రక్షణ, హోం మంత్రిత్వశాఖలు సహా 12కు పైగా ప్రభుత్వ వెబ్‌సైట్లు శుక్రవారం హ్యాకింగ్‌కు గురయ్యాయి. సైబర్‌దాడికి గురైన ఈ వెబ్‌సైట్లలో చైనీస్‌ అక్షరాలు కన్పించడంతో ఈ పని చైనా హ్యాకర్లే చేసుంటారని అధికారులు అనుమానిస్తున్నారు. రక్షణ, హోం మంత్రిత్వశాఖలతో పాటు న్యాయ, కార్మిక మంత్రిత్వశాఖల వెబ్‌సైట్లపై కూడా సైబర్‌దాడి జరిగింది.

ఈ ఘటనపై స్పందించిన రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌ త్వరలో రక్షణ శాఖ వెబ్‌సైట్‌ను పునరుద్ధరిస్తామని ట్వీట్‌ చేశారు. కాగా, కేంద్ర ప్రభుత్వ వెబ్‌సైట్లపై ఎలాంటి సైబర్‌దాడి జరగలేదని జాతీయ సైబర్‌ భద్రత (ఎన్‌సీఎస్‌) సమన్వయకర్త గుల్షన్‌ రాయ్‌ అన్నారు. నెట్‌వర్కింగ్‌ వ్యవస్థలో హార్డ్‌వేర్‌ ఫెయిల్యూర్‌ కారణంగానే ఈ ఇబ్బంది తలెత్తిందని వెల్లడించారు.

మరిన్ని వార్తలు