పూర్తి వేతనాల చెల్లింపు ఉత్తర్వులు వెనక్కి

19 May, 2020 05:26 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశంలో లాక్‌డౌన్‌ అమల్లో ఉన్న సమయంలో వివిధ వాణిజ్య సంస్థలు, కంపెనీలు పనిచేయకున్నా సరే, సిబ్బందికి పూర్తి వేతనాలివ్వాలంటూ ఇచ్చిన ఉత్తర్వులను కేంద్రం ఉపసంహరించుకుంది. నాలుగో విడత లాక్‌డౌన్‌ మార్గదర్శకాలను విడుదల చేస్తూ హోం శాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా ఈ విషయం వెల్లడించారు. ఈ మేరకు డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ చట్టం కింద జారీ చేసిన ఆదేశాలను నిలిపివేస్తున్నట్లు తెలిపారు. దీంతో ఆదాయం లేని సమయంలో, పూర్తి వేతనాలు చెల్లించే స్తోమత లేని చాలా కంపెనీలు, పారిశ్రామిక యూనిట్లకు ఊరట లభించినట్లయింది. వేతనాలు చెల్లించలేని కంపెనీలపై ఎలాంటి చర్యలు తీసుకోరాదంటూ సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. 

మరిన్ని వార్తలు