యూపీ: టీచర్‌ పోస్టులకు బ్రేక్‌.. ప్రభుత్వం సవాల్‌

7 Jun, 2020 14:48 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

లక్నో: ప్రైమరీ టీచర్ల నియామకాలు ఆపాలంటూ సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. టీచర్ల నియామకాల్లో నిబంధనల ఉల్లంఘన జరగలేదని ఆ రాష్ట్ర ఎగ్జామినేషన్‌ రెగ్యులారిటీ అథారిటీ స్పష్టం చేసింది. ఈమేరకు ఇద్దరు జడ్జిల డివిజన్‌ బెంచ్‌లో సింగిల్‌ జడ్జి తీర్పును సవాల్‌ చేసింది. సింగిల్‌ జడ్జి తీర్పు అనవసర, చట్టవిరుద్ధమైందని పిటిషన్‌లో పేర్కొంది.

కాగా, రాష్ట్రంలో ఇటీవల 69 వేల ప్రైమరీ టీచర్‌ పోస్టుల నియామకాలకు పరీక్షలు జరిగాయి. అయితే, ప్రశ్నాపత్రాల్లో తప్పులు దొర్లాయని, కొన్ని ప్రశ్నలకు సమాధానాలు అస్పష్టంగా ఉన్నాయనే కారణాలతో.. నియామక ప్రక్రియను నిలుపుదల చేయాలని జస్టిస్‌ అలోక్‌ మాథుర్‌ నేతృత్వంలోని సింగిల్‌ జడ్జి బెంచ్‌ జూన్‌ 3న ఉత్తర్వులు జారీ చేసింది. ఇక యూపీ ప్రభుత్వం చేసిన అప్పీల్‌ను జూన్‌ 9న డివిజనల్‌ బెంచ్‌ విచారించనుంది.

మరిన్ని వార్తలు