మూక హత్యలపై స్పందించిన కేంద్రం

24 Jul, 2019 19:37 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా పెరుగుతున్న మూక హత్యలపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. వివిధ రాష్ట్రాల్లో వివిధ పార్టీల ప్రభుత్వాలు నడుస్తున్న క్రమంలో చోటుచేసుకుంటున్న ఘటనలో ఎలాంటి సారూప్య అంశాలు లేవని బుధవారం రాజ్యసభలో ప్రభుత్వం పేర్కొంది. మూకదాడులపై బీజేపీ ప్రభుత్వం తీవ్రంగా స్పందిస్తుందని, ప్రధాని ఇప్పటికే ఈ దాడుల పట్ల ఆందోళన వ్యక్తం చేశారని హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి సభలో ప్రశ్నోత్తరాల సమయంలో పేర్కొన్నారు.

వివిధ రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్న వివిధ రాష్ట్రాల్లో ఈ తరహా ఘటనలు చోటుచేసుకున్నాయని వీటిలో సారూప్యత ఏమీ లేదని చెప్పారు. మూక దాడులు త్రిపుర, పశ్చిమ బెంగాల్‌, కేరళలో కూడా వెలుగుచూశాయని, గతంలోనూ ఇలాంటి ఉదంతాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. మరోవైపు గత ఐదేళ్లుగా మైనారిటీలు, దళితులపై మూక హత్యలు, మూకదాడులు పరిపాటిగా మారాయని రాజ్యసభలో విపక్ష నేత గులాం నబీ ఆజాద్‌ ఆందోళన వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు