సంచలనం : 12 మంది సీనియర్‌ అధికారులకు షాక్‌

11 Jun, 2019 10:03 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని ఎన్‌డీఎ ప్రభుత్వం అధికార దుర్వినియోగం, అవినీతి, దోపిడీ, అక్రమ ఆస్తులు, విధుల్లో నిర్లక్ష్యం, తోటి మహిళా ఉద్యోగులపై లైంగిక ఆరోపణల నేపథ్యంలో సంచలన నిర్ణయం తీసుకుంది. ఒక్కరు ఇద్దరు కాదు ఏకంగా 12మంది సీనియర్ అధకారులపై కొరటా ఝుళిపించింది.  నిర్బంద పదవీ విరమణ ఆదేశించింది.  వీరంతా చీఫ్ కమిషనర్, ప్రిన్సిపల్ కమిషనర్, కమిషనర్ స్థాయి అధికారులు కావడం గమనార్హం. వీరిపై జనరల్ ఫైనాన్షియల్ నిబంధన 56 ప్రకారం బాధ్యతల నుంచి తొలగిస్తూ కేంద్ర ఆర్థికశాఖ సోమవారం ఆదేశాలు జారీ చేసినట్టుగా పలు నివేదికల ద్వారా తెలుస్తోంది.

వీరిలో అశోక్ అగర్వాల్ (ఐఆర్ఎస్ 1985), జాయింట్ కమిషనర్ ఆదాయపు పన్ను (సిట్), ఎస్.కె. శ్రీవాత్సవ (ఐఆర్ఎస్, 1989), కమిషనర్ (అప్పీల్), నోయిడా, హోమి రాజ్వంశ్ (ఐఆర్ఎస్, 1985), బిబి రాజేంద్రప్రసాద్, అజయ్ కుమార్ సింగ్ (సిట్), బి.అరుళప్ప (సిట్)తో పాటు అలోక్ కుమార్ మిత్రా, చందర్ సైని భారతి, అందాసు రవీందర్, వివేక్ బాత్రా, శ్వేతబ్‌ సుమన్,  రామ్ కుమార్ భార్గవ ఉన్నారు.

ముఖ్యంగా లైంగిక వేధింపులు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆరోపణలపై నోయిడా కమిషనర్ ఎస్.కే శ్రీవాస్తవకు ఉద్వాసన పలకడం సంచలనంగా మారింది. వీరితోపాటు బలవంతపు వసూళ్ల ఆరోపణలపై అశోక్ కుమార్ అగర్వాల్,  అధికార దుర్వినియోగం, అక్రమార్జన కింద హోమీరాజ్ వంశ్, అవినీతి ఆరోపణలపై అజయ్ కుమార్, చందర్, అందాసు రవీందర్, వివేక్ బాత్రా, శ్వేతబ్ సుమన్, భార్గవ బాధ్యతలనుంచి తప్పించి బలవంతపు  రిటైర్మెంట్‌కు ఆదేశాలిచ్చినట్టు సమాచారం.

మరిన్ని వార్తలు