విదేశాలకు వెళ్లేవారికి నైపుణ్య శిక్షణ

3 Jul, 2016 19:15 IST|Sakshi

న్యూఢిల్లీ: పని కోసం విదేశాలకు వెళ్లాలనుకునేవారికి ప్రవాసీ కౌశల్ వికాస్ యోజన(పీకేవీవై)పథకంలో భాగంగా శిక్షణ ఇచ్చేందుకు కేంద్ర విదేశాంగ శాఖ, నైపుణ్యాభివృద్ధి, వ్యాపార కల్పన శాఖల మధ్య  ఒప్పందం కుదిరింది. ఈ పథకంలో భాగంగా విదేశాల్లో ఉద్యోగాలు చేయాలనుకునేవారికి నైపుణ్యం మెరుగుపర్చుకునేందుకు శిక్షణ ఇస్తారు. విదేశాలకు పని కోసం వెళ్లే భారతీయులు సరైన నైపుణ్యం లేకపోవడం వల్ల పలు అవమానాలు ఎదుర్కొంటున్నారని, ముఖ్యంగా గల్ఫ్ దేశాలకు వెళ్లే వారికి ఈ పరిస్థితి ఎదురవుతుందని విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ చెప్పారు.

విదేశాల్లో ఉద్యోగాన్ని ఆశించే వారికి ప్రవాసీ కౌశల్ వికాస్ యోజన ఒక మైలురాయి వంటిదని, నైపుణ్యం పెంచుకోవడం వల్ల ఉద్యోగావకాశాలు పెరుగుతాయని ఆమె పేర్కొన్నారు. అధికారిక లెక్కల ప్రకారం ప్రతీ ఏడాది పని నిమిత్తం 7 నుంచి 8 లక్షల మంది భారతీయులు విదేశాలకు వెళ్తున్నారని విదేశాంగ శాఖ అదనపు కార్యదర్శి ధ్యానేశ్వర్ ములే చెప్పారు. వీరిలో గల్ఫ్‌కు వెళ్లే ఎక్కువ మందికి అక్కడి నిబంధనలు, భాష, సంస్కృతి గురించి సరైన పరిజ్ఞానం ఉండడం లేదన్నారు.
 

మరిన్ని వార్తలు