డ్రోన్లకు డిజిటల్‌ పర్మిట్‌

2 Dec, 2018 04:42 IST|Sakshi

ముంబై: డ్రోన్‌ ఆపరేటర్లు ఆన్‌లైన్‌లో నమోదుచేసుకునే సదుపాయాన్ని పౌర విమానయాన శాఖ ప్రారంభించింది. ‘డిజిటల్‌ స్కై’ అనే పోర్టల్‌ ద్వారా ఈ ప్రక్రియ చేపడతారు. డ్రోన్‌ ఆపరేటర్లు వనటైమ్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. డ్రోన్‌ పైలట్లు, యజమానుల వివరాల్ని నమోదుచేయాలి. నానో డ్రోన్స్‌ చట్టబద్ధంగా ఎగిరేందుకు అనుమతులిచ్చినట్లు పౌర విమానయాన శాఖ తెలిపింది. డిజిటల్‌ నమోదుకు సంబంధించిన చెల్లింపుల్ని భారత్‌ కోష్‌ పోర్టల్‌ ద్వారా స్వీకరిస్తున్నట్లు తెలిపింది. గ్రీన్‌జోన్‌లో డ్రోన్‌ ఎగరడానికి ముందు సమయం, ప్రాంతం లాంటి వివరాల్ని ముందస్తుగా చెప్పాలి. యెల్లో జోన్‌లో ఆపరేట్‌ చేయాలంటే మాత్రం తప్పకుండా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. రెడ్‌ జోన్‌లో డ్రోన్లను అనుమతించరు. ఏయే ప్రాంతాలు ఏయే జోన్ల కిందికి వస్తాయో త్వరలో ప్రకటిస్తారు.

మరిన్ని వార్తలు