ఇక పట్టాల పైకి దేశీ రైళ్లు

22 Jul, 2019 14:54 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : మేకిన్‌ ఇండియాలో భాగంగా భారత్‌లో రైళ్ల తయారీ ప్రక్రియను పారదర్శకంగా చేపట్టేందుకు గ్లోబల్‌ టెండర్లను ఆహ్వానించేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ట్రైన్‌ సెట్స్‌ను తయారు చేసేందుకు బిడ్డింగ్‌ ప్రక్రియలో చైనా, జర్మనీ, అమెరికన్‌ కంపెనీలు పాలుపంచుకుంటాయని అధికారులు చెబుతున్నారు. మేకిన్‌ ఇండియా, ఉపాధి కల్పనకు ఊపునిచ్చేలా గ్లోబల్‌ టెండర్‌ ప్రక్రియ ద్వారా దేశీయంగానే ట్రైన్‌ సెట్ల తయారీ చేపడతారు.

బిడ్‌లో పనులు దక్కించుకునే కంపెనీలు దీర్ఘకాలంట్రైన్నిర్వహణ చేపట్టేలా నిబంధనల్లో క్లాజు విధించనున్నారు. వందే భారత్‌ ట్రైన్‌ టెండర్‌ ప్రక్రియపై ఆరోపణలు వెల్లువెత్తడంతో దేశీ రైళ్ల తయారీకి గ్లోబల్‌ టెండర్లను ఆహ్వానించాలని ప్రభుత్వం నిర్ణయించడం గమనార్హం. దేశంలో తయారైన తొలి వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ను ఈ ఏడాది ఫిబ్రవరి 15న ప్రధాని ప్రారంభించిన సంగతి తెలిసిందే. రూ 100 కోట్ల లోపు వ్యయంతో కేవలం 18 నెలల వ్యవధిలో ఈ రైలును పట్టాలెక్కించారు.

మరిన్ని వార్తలు