రేషన్‌ ధరలపై కేంద్రం కీలక ప్రకటన

28 Jun, 2017 15:01 IST|Sakshi
రేషన్‌ ధరలపై కేంద్రం కీలక ప్రకటన
న్యూఢిల్లీ: పేదలకు సబ్సిడీ ధరలకు నిత్యావసరాలను సరఫరా చేసే "ప్రజాపంపిణీ వ్యవస్థ’’ (పీడీఎస్‌)  ధరలను   పెంచబోమని కేంద్ర ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. ఆహార ధాన్యాల ధరల పెంపు  మరో ఏడాది పాటు  ఉండదంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని కేంద్ర ఆహార శాఖామంత్రి  రామ్ విలాస్ పాశ్వాన్ ట్వీట్ చేశారు. 
 
 పీడీఎస్ ద్వారా పంపిణీ చేసే  బియ్యం, గోధుమలు ఇతర తృణధాన్యాల విక్రయ ధరలను ఒక సంవత్సరం వరకు  పెంచమని  రాం విలాశ్ పాశ్వాన్ ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు.   తద్వారా  ప్రభుత్వం అణగారిన వర్గాల సంక్షేమానికి  తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.  2013 లో ఆమోదం పొందిన నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ (ఎన్ఎఫ్ఎస్ఎ) కింద మూడు సంవత్సరాలకు ఆహారధాన్యాల ధరలను సమీక్షిస్తారు.
 
 
మరిన్ని వార్తలు