రెండు నెలలకు సరిపడా గ్యాస్‌ సిలిండర్లు నిల్వ చేసుకోండి

29 Jun, 2020 08:12 IST|Sakshi

శ్రీనగర్‌: సరిహద్దుల్లో తరచూ కయ్యానికి కాలు దువ్వుతున్న చైనాతో తాడోపేడో తేల్చుకోవాలని ఇండియా భావిస్తోందా? ఆ దిశగా అడుగులు వేస్తోందా? తాజాగా జమ్మూకశ్మీర్‌ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను గమనిస్తే ఇలాంటి అనుమానాలే తలెత్తుతున్నాయి. కశ్మీర్‌ లోయలో రెండు నెలలకు సరిపడా ఎల్పీజీ సిలిండర్లను నిల్వ చేసి పెట్టుకోవాలని చమురు మార్కెటింగ్‌ కంపెనీలకు రాష్ట్ర ఆహార, పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల విభాగం డైరెక్టర్‌ జూన్‌ 27న ఆదేశాలు జారీ చేశారు. వీటిని అత్యవసరమైన ఆదేశాలుగా పేర్కొన్నారు. (పథకం ప్రకారమే డ్రాగన్‌ దాడి!

చైనాతో సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఆదేశాలు ఇవ్వడంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కశ్మీర్‌ లోయలో కొండ చరియలు విరిగిపడుతుండడంతో జాతీయ రహదారులను మూసివేయాల్సి ఉంటుందని, అందుకే గ్యాస్‌ సిలిండర్లను నిల్వ చేసుకోవాలని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. వర్షా కాలంలో ఇలాంటి ఆదేశాలు సాధారణమేనంటున్నాయి.

కాగా, చైనా పక్కా పథకం ప్రకారమే గల్వాన్‌ సరిహద్దుల్లో భారత్‌పై కయ్యానికి కాలు దువ్వినట్టుగా తాజాగా వెల్లడైంది. జూన్‌ 15 రాత్రి ఘర్షణలకి ముందే కరాటే, కుంగ్‌ఫూ వంటి యుద్ధ కళల్లో ఆరితేరిన మార్షల్‌ యోధులు, ఎవరెస్టు వంటి పర్వత శ్రేణుల్ని అలవోకగా ఎక్కగలిగే నైపుణ్యం కలిగిన వీరుల్ని చైనా సరిహద్దుల్లో మోహరించింది. ఈ విషయాన్ని చైనా జాతీయ మీడియానే స్వయంగా తెలిపింది. (స్నేహానికి గౌరవం.. శత్రువుకు శాస్తి: ప్రధాని మోదీ)

Poll
Loading...
మరిన్ని వార్తలు