మరో 7 కోట్ల కిసాన్‌ క్రెడిట్‌ కార్డులు

20 Jul, 2019 06:16 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశంలోని రైతులందరికీ కిసాన్‌ క్రెడిట్‌ కార్డులను పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వ్యవసాయ శాఖ సహాయ మంత్రి పురుషోత్తం రుపాలా రాజ్యసభకు తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న 6.5 కోట్ల మంది రైతులకు ఇప్పటికే కిసాన్‌ క్రెడిట్‌ కార్డులను అందజేశామని, మిగతా 7 కోట్ల మందికి కూడా వీటిని అందజేసేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు వివరించారు. రైతులందరికీ సంస్థాగత రుణ సదుపాయం కల్పించే లక్ష్యంతో ఈ పథకాన్ని ముఖ్యమైందిగా ప్రభుత్వం భావిస్తోందన్నారు. రైతు సమస్యలపై ప్రవేశపెట్టిన ఓప్రైవేట్‌ బిల్లుపై చర్చ సందర్భంగా ఆయన ఈ వివరాలు వెల్లడించారు. ఈ పథకానికి ప్రభుత్వం రూ.14 లక్షల కోట్లను కేటాయించిందన్నారు. చిన్న కమతాల పెరుగుదల, దిగుబడులు తగ్గడంపై ఆయన మాట్లాడుతూ.. దీనికి విరుగుడుగా ఉమ్మడి సేద్యం వైపు రైతులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించిందని చెప్పారు.

జన్యు పంటలు ప్రమాదకరమనేందుకు ఆధారాల్లేవు: కేంద్రం
జన్యు పంటలు ప్రమాదకరమని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని  పర్యావరణ సహాయ మంత్రి బాబుల్‌ సుప్రియో లోక్‌సభకు తెలిపారు. మనుషులకు ప్రమాదకరంగా పరిణమించే జన్యు పంటలను చట్ట విరుద్ధంగా పండించే వారిపై చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్రాలలకు సూచించామన్నారు.  

ఆగస్టు 2 వరకు పార్లమెంట్‌!
పార్లమెంట్‌ సమావేశాలను మరికొద్ది రోజులు పొడిగించాలని ప్రభుత్వం యోచిస్తోంది. షెడ్యూల్‌ ప్రకారం ఈ నెల 26వ తేదీతో సమావేశాలు ముగియాల్సి ఉంది. అయితే, ముందుగా అనుకున్న ప్రకారం అన్ని బిల్లులను ప్రవేశపెట్టేందుకు వీలుగా సమావేశాలను ఆగస్టు 2వ తేదీ వరకు పొడిగించాలని భావిస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. కొన్ని ప్రతిపక్ష పార్టీలు ఈ ప్రతిపాదనకు సానుకూలంగా లేనప్పటికీ అధికార పక్షం నిర్ణయమే అంతిమం కానుంది. ప్రభుత్వ షెడ్యూల్‌ ప్రకారం ట్రిపుల్‌ తలాక్‌ సహా మరో 13 బిల్లులను లోక్‌సభలో ప్రవేశపెట్టాల్సి ఉంది. జూన్‌ 17వ తేదీ నుంచి కొనసాగుతున్న పార్లమెంట్‌ సమావేశాలు గత 20 ఏళ్లలోనే అత్యంత ఫలప్రదంగా సాగాయని పీఆర్‌ఎస్‌ లెజిస్లేటివ్‌ రీసెర్చ్‌ అనే సంస్థ తెలిపింది.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

గవర్నర్ వర్సెస్ ముఖ్యమంత్రి

సంచలన ఎంపీపై పరువునష్టం దావా

ప్రియాంక గాంధీ అయితే ఓకే..

ఈశాన్య రాష్ట్రాల్లో భూకంపం

వైరల్‌: ఒళ్లు గగుర్పొడిచే యాక్సిడెంట్‌

ఈనాటి ముఖ్యాంశాలు

విషాదం: ఎనిమిది మంది చిన్నారుల మృతి

అదే నోటితో.. మటన్‌, బీఫ్‌ కూడా..

రిపీట్‌ కావొద్దు; కేంద్రమంత్రికి వార్నింగ్‌!

గరీబ్‌రథ్‌ రైళ్లను ఆపే ప్రసక్తే లేదు..!

పార్లమెంట్‌ సమావేశాలు మూడు రోజులు పొడగింపు!

మహిళా ఉద్యోగులకు డ్రెస్‌ కోడ్‌పై దుమారం

విడాకుల కోసం.. భార్యను స్నేహితుడితో..

చాలా అందమైన ఫొటో..ఆమె గొప్పతల్లి...

అపూర్వ శుక్లాపై చార్జీ షీట్‌ దాఖలు

ప్రియాంక గాంధీని అడ్డుకున్న అధికారులు..!

రాజకీయాల్లోకి ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్ట్‌!

నాలుగు రోజుల్లోనే రెట్టించిన ఉత్సాహంతో

భార్య ప్రియునిపై పగ; తొమ్మిదిమందికి షాక్‌..!

అయ్యో! రూ.2 వేల కోసం విషా(వా)దం

ఆర్థిక బిల్లుకు లోక్‌సభ ఆమోదం

పండితుడి జోస్యం.. మూడోపెళ్లిపై వ్యామోహం!

ఎన్‌కౌంటర్ల దర్యాపుపై సుప్రీం మార్గదర్శకాలు పాటించాల్సిందే..

32 ట్రాక్టర్లు.. 200 మంది

మాయా సోదరుడి 400 కోట్ల స్థలం అటాచ్‌

‘శరవణ’ రాజగోపాల్‌ కన్నుమూత

పాన్పుపై సేదతీరిన పులి!

కర్నాటకం క్లైమాక్స్‌ నేడే

రైలును ఆపి ఇంజన్‌ ఎదుటే..

హిజాబ్‌ ధరించి హిందూ కార్యక్రమానికి వెళతావా?

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

తెలుగు సినిమాకి మంచి కాలం

సోడాల్రాజు

నో కాంప్రమైజ్‌

సముద్రాల రచనలు పెద్ద బాలశిక్ష

ధృవ కష్టం తెలుస్తోంది

భయాన్ని వదిలేసిన రోజున గెలుస్తాం