నక్సల్స్‌ ప్రాంతాల్లో 4 వేల సెల్‌ టవర్లు

17 Apr, 2018 02:27 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాల్లో 4,072 సెల్‌ టవర్లు ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. మొబైల్‌ టవర్‌ ఫేజ్‌–2 కింద 10 రాష్ట్రాల్లో టవర్ల ఏర్పాటుకు టెలికం కమిషన్‌ ఆమోదం తెలిపింది. కేబినెట్‌ ఆమోదానికి ఈ ప్రతిపాదనను పంపింది.  మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సెల్‌ టవర్ల ఏర్పాటు ద్వారా మొబైల్‌ ఫోన్ల వాడకం పెరగడంతో కొంత మేర భద్రత సవాళ్లను అధిగమించవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ కొత్త టవర్లలో జార్ఖండ్‌లో 1,054, ఛత్తీస్‌గఢ్‌లో 1,028, ఒడిశాలో 483, ఆంధ్రప్రదేశ్‌లో 429, బిహార్‌లో 412, పశ్చిమ బెంగాల్‌లో 207, ఉత్తరప్రదేశ్‌లో 179, మహారాష్ట్రలో 136, తెలంగాణలో 118, మధ్యప్రదేశ్‌లో 26 టవర్లను ఏర్పాటు చేయనున్నారు.

మరిన్ని వార్తలు