'ఆధారాలు చూపిస్తే మంత్రిపై విచారణకు సిద్ధం'

26 Jun, 2015 13:54 IST|Sakshi
'ఆధారాలు చూపిస్తే మంత్రిపై విచారణకు సిద్ధం'

ముంబై: మహారాష్ట్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి పంకజ ముండేపై వచ్చిన అవినీతి ఆరోపణలపై ప్రతిపక్షాలు ఆధారాలు సమర్పిస్తే విచారణ జరిపిస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ చెప్పారు. చిన్నారులకు అందించే ఆహారపదార్థాలను నిబంధనలకు విరుద్ధంగా కొనుగోలు చేశారని పంకజపై వచ్చిన ఆరోపణలపై ఫడ్నవిస్ స్పందించారు.

ప్రతిపక్షాలు నిరాధారమైన ఆరోపణలు చేయడం మాని ఏవైనా ఆధారాలుంటే బయటపెట్టాలని సూచించారు. వీటిపై విచారణ జరిపించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఫడ్నవిస్ చెప్పారు. పంకజ 206 కోట్ల రూపాయల కాంట్రాక్టుకు సంబంధించి అవినీతికి పాల్పడినట్టు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు