ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల యోగా!

25 Jun, 2016 17:11 IST|Sakshi
ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల యోగా!

మైసూరుః అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఘనంగా జరుపుకున్నారు. స్వామీ వివేకానంద యూత్ మూవ్ మెంట్ (ఎస్వీవైఎమ్) ఆధ్వర్యంలో మైసూరులోని మెట్ గల్లీ మురికి వాడలో ఉండే ప్రభుత్వ హయ్యర్ ప్రైమరీ స్కూల్ విద్యార్థులకోసం శనివారం ప్రత్యేకంగా  యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు.

మైసూరులో ఎస్వీవైఎమ్ ఆధ్వర్యంలో జరిగిన యోగా కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులకోసం ప్రత్యేకంగా యోగా తరగతులను నిర్వహించారు. 15 సంవత్సరాల యోగా శిక్షణలో అనుభవం ఉన్న రామన్న.. వారికి యోగాలో శిక్షణ ఇచ్చారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యోగా కార్యక్రమానికి స్థానిక వీల్ రోటరీ క్లబ్ సారధ్యం వహించగా, కార్యక్రమంలో పాల్తొన్నవారికి  హోటల్ గ్రాండ్ మెర్క్యూర్.. పండ్ల రసాలు, పానీయాలను ఉచితంగా అందించింది.

శరీరానికి, మెదడుకు మధ్య సమన్వయాన్ని కుదిర్చి, సమతుల్యతకు సహకరించే యోగాను ప్రతి వ్యక్తి చేయాల్సిన అవసరం ఉందని, యోగా ఆరోగ్యవంతమైన జీవనానికి కూడ ఎంతో సహకరిస్తుందని కార్యక్రమ నిర్వాహకులు వివరించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆధ్వర్యంలో జరిగిన రెండవ ప్రపంచ యోగా దినోత్సవాన్నిగతవారం ప్రపంచవ్యాప్తంగా 130 దేశాలు వివిధ ఆసనాలతో ఘనంగా జరుపుకున్న విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు