టూరిస్టులకు కేంద్రం బంపర్‌ ఆఫర్‌

25 Jan, 2020 15:46 IST|Sakshi

దేశీయంగా 15 ప్రదేశాలను సందర్శించాలి 

సొంత రాష్ట్రం కాకుండా , ఇతర  రాష్ట్రాల్లో 2022  లోపు ఈ లక్ష్యాన్ని చేరాలి

ఒక ఏడాదిలోగా ఇది పూర్తిచేసిన వారికి రివార్డు 

టూరిస్ట్‌  గైడ్స్‌ కోసం సర్టిఫికెట్‌ ప్రోగ్రాం

సాక్షి,న్యూఢిల్లీ: టూరిస్టులకు కేంద్రం ప్రభుత్వం భలే ఆఫర్‌ను ప్రకటించింది. సంవత్సరంలో దేశీయంగా 15 పర్యాటక ప్రదేశాలను సందర్శించిన  ప్రయాణికులకు బంపర్‌ ఆఫర్‌ అందించనుంది. ప్రయాణ ఖర్చులను బహుమతిగా ఇవ్వాలని కేంద్రం నిర్ణయించిందని కేంద్ర పర్యాటక మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్  ప్రకటించారు. కోణార్క్‌లో ఫిక్కీ సహకారంతో ఒడిశా ప్రభుత్వం ఏర్పాటు చేసిన రెండు రోజుల జాతీయ పర్యాటక సదస్సు ముగింపు కార్యక్రమంలో కేంద్రమంత్రి శుక్రవారం ఈ విషయం వెల్లడించారు. సంవత్సరం లోపు ఈ టాస్క్‌ను పూర్తి చేసిన  టూరిస్టులను ప్రభుత్వం రివార్డుతో సంత్కరిస్తామన్నారు. టూరిస్టులను మరింత ప్రోత్సాహించే చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం  తీసుకున్నామని చెప్పారు. 

కేంద్ర ప్రభుత్వం చేపట్టిన  ‘పర్యాటన్‌ పర్వ్‌’ కార్యక్రమంలో భాగంగా  అతడు /ఆమె 2022 నాటికి భారతదేశంలోని కనీసం 15 పర్యాటక ప్రదేశాల్లో పర్యటించాలి. స్వరాష్టం తప్ప ఇతర రాష్టాల్లో 15 ప్రదేశాలను సందర్శించాలి అనేది ప్రధాన షరతు. ఇందుకు గాను వారికి ప్రోత్సహకక బహుమతిగా ప్రయాణ ఖర్చులను పర్యాటక మంత్రిత్వ శాఖ భరిస్తుంది. అయితే ఇది నగదు రూపంలో కాకుండా   ప్రోత్సాహక​ బహుమతిగా వుంటుందని స్పష్టం చేశారు.  సంబంధిత  ఫోటోలను తమ వెబ్‌సైట్‌లో పొందు పరుస్తామని ఆయన తెలిపారు. అలాగే ఎంపికైన వారిని భారతీయ పర్యాటక బ్రాండ్ అంబాసిడర్లుగా గుర్తిస్తామన్నారు. త్వరలోనే కోణార్క్‌లోని సూర్య దేవాలయాన్ని 'ఐకానిక్ సైట్ల' జాబితాలో చేర్చనున్నట్లు కేంద్ర పర్యాటక మంత్రి తెలిపారు.

అంతేకాదు టూరిస్టు గైడ్స్‌గా పనిచేయాలనుకునే అభ్యర్థుల కోసం పర్యాటక మంత్రిత్వశాఖ సర్టిఫికేట్ ప్రొగ్రామ్‌ కూడా నిర్వహిస్తోంది. కానీ ఈ కార్యక్రమంలో ఒడిశా పాల్గొనడం చాలా తక్కువ, దీనిని మెరుగు పరచాల్సిన అవసరం ఉందని పర్యాటక శాఖ అదనపు డైరెక్టర్ జనరల్ రూపైందర్ బ్రార్ అన్నారు. మరోవైపు మరిన్ని పర్యాటక ప్రదేశాలను అనుసంధానించడానికి మరిన్ని పర్యాటక రైళ్లను ప్రవేశపెట్టాలని ఫిక్కీ ఈస్టర్న్ టూరిజం కమిటీ చైర్మన్ సౌభాగ్య మోహపాత్ర కోరారు. 

మరిన్ని వార్తలు