సాయుధ బలగాల కుదింపు

6 Jan, 2020 04:41 IST|Sakshi

న్యూఢిల్లీ: పారామిలటరీ బలగాలను కుదించి, పోరాటపటిమను పెంచే వివిధ ప్రతిపాదనలను కేంద్రం తీవ్రంగా పరిశీలిస్తోంది. ‘ఒకే సరిహద్దు.. ఒకే సైన్యం’విధానంలో భాగంగా సశస్త్రసీమా బల్‌(ఎస్‌ఎస్‌బీ), ఇండో టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ (ఐటీబీపీ) విభాగాలను విలీనం చేయడం  వంటి ప్రతిపాదనలున్నాయని అధికారులు వెల్లడించారు. దీనిపై సీనియర్‌ అధికారులతో ప్రత్యేక కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీ తన నివేదికను మరో ఆరునెలల్లో అందజేయనుంది. సీఆర్పీఎఫ్‌తో ఉగ్రవాద వ్యతిరేక కమాండోలు, ఎన్‌ఎస్‌జీలను కూడా ఏకం చేసే అంశంపైనా చర్చ జరుగుతోంది. ఉగ్ర వ్యతిరేక పోరు, హైజాక్‌ ఘటనలు, మావోయిస్టు, తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో పనిచేసే ఈ రెండు విభాగాలను ఒకే కమాండ్‌ కిందికి తీసుకువచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయంటున్నారు.  హోం శాఖ నేతృత్వంలో జాతీయ భద్రతా దళం (ఎన్‌ఎస్‌జీ)తోపాటు సీఆర్పీఎఫ్, బీఎస్‌ఎఫ్, ఐటీబీపీ, సీఐఎస్‌ఎఫ్, ఎస్‌ఎస్‌బీలున్నాయి.

మరిన్ని వార్తలు