తండ్రిలా తనకు తోడుంటా..

11 Dec, 2018 15:02 IST|Sakshi

తమిళనాడు పరువుహత్య బాధితురాలు కౌశల్య కొత్త  జీవితానికి నాంది పలికారు.  భర్త శంకర్‌ హత్యతో కుంగిపోకుండా పడిలేచిన కెరటంలా సాంఘిక ఉద్యమాల్లో చురుగాగా పొల్గొంటూ అందరినీ ఆకట్టుకున్న కౌశల్య తాజాగా మరోసారి  ఆదర్శనీయంగా నిలిచారు.  తన జీవితంలో  చోటు చేసుకున్న అత్యంత విషాదం నుంచి కోలుకుని సరికొత్త జీవితానికి తొలి అడుగు వేశారు. తన తోటి కళాకారుడు, కార్యకర్త శక్తిని ఆదర్శ  వివాహం చేసుకున్నారు.

కోయంబత్తూరులోని తందై పెరియార్ ద్రవిడగర్ కజగం ప్రధాన కార్యాలయంలో ఆదివారం వీరి పెళ్లి ఘనంగా జరిగింది. పలువురు పెరియార్‌ ఉద్యమ కారులు, ఇతర సామాజిక ఉద్యమ నాయకులు ఈ వివాహానికి హాజరై కౌశల్య, శక్తిలకు అభినందనలు తెలిపారు. 

తండ్రిలా తోడుంటా..

కుల దురహం‍కారానికి బలైపోయిన కౌశల్య ‘శంకర్‌ సోషల్‌ జస్టిస్‌ ఫౌండేషన్‌’ పేరుతో కులానికి, మతానికి వ్యతిరేకంగా పోరాడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తనకు ఉద్యమంలో పరిచయమైన కార్యకర్త శక్తిని వివాహం చేసుకున్నారు. శంకర్‌ ఫౌండేషన్‌తో తనకు ఎలాంటి సంబంధంలేకపోయినా,ఆ ఉద్యమంలో ఎలాంటి అవరోధం కల్పించకుండా, తండ్రిలాగా కౌశల్యకు అండగా ఉంటానని శక్తి ప్రకటించారు.  మరోవైపు ఉద్యమాల్లో రాజకీయంగా శక్తికి అండగా ఉంటూనే  పరువు హత్యలకు వ్యతిరేకంగా ఒక చట్టం వచ్చేంతవరకు పోరాడతానని కౌశల్య స్పష్టం చేశారు.

కాగా 2016లోదళిత యువకుడిని పెళ్లి చేసుకుందనే అక్కసుతో కౌశల్య భర్త శంకరును ఆమె తల్లిందండ్రులు అతికిరాతంగా హత్య చేశారు. 19 సం.రాల వయసులో  శంకర్‌తో నూతన జీవితాన్ని ప్రారంభించిన కేవలం 9నెలల కాలంలో  ఎదురైన ఈ విషాదాన్ని  ధైర్యంగా ఎదుర్కొన్న కౌశల్య  శంకర్‌ హంతకులకు శిక్షపడేలా పోరాడింది. ఈ నేపథ‍్యంలో డిసెంబర్ 12, 2017న  నేరస్తులకు మరణశిక్ష విధిస్తూ  తిరుప్పూర్ కోర్టు తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు