ప్రిన్స్ జంటకు ఢిల్లీ స్వాగతం

12 Apr, 2016 02:23 IST|Sakshi
ప్రిన్స్ జంటకు ఢిల్లీ స్వాగతం

ముంబై: బ్రిటన్ రాకుమారుడు విలియం, ఆయన సతీమణి కేట్ మిడి ల్టన్‌ల రెండో రోజు భారత పర్యటన ఉత్సాహంగా సాగింది. సోమవారం మధ్యాహ్నం ముంబై నుంచి ఢిల్లీ చేరుకున్న వీరు మహాత్మాగాంధీ స్మృతి వనంలో అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. అనంతరం అక్కడున్న మ్యూజియంను సందర్శించారు. గాంధీ వాడిన చరఖా గురించి తెలుసుకున్నారు.  30 మంది స్కూలు విద్యార్థులతో విలియం దంపతులు ముచ్చటించారు. 45 నిమిషాలు గాంధీ స్మృతివనంలో వారిద్దరూ గడిపారు. క్రీమ్ రంగు దుస్తుల్లో మిడిల్టన్ మెరిసిపోయారు. బ్రిటన్ రాణి ఎలిజబెత్ 90వ జన్మదినం సందర్భంగా రాత్రి బ్రిటిష్ హైకమిషనర్ ఇచ్చిన విందుకు విలియం జంట హాజరైంది.

 ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో ముచ్చట
 అంతకుముందు ఉదయం ఔత్సాహిక పారి శ్రామికవేత్తలు, పెట్టుబడిదారులతో ముంబై లో నిర్వహించిన కార్యక్రమంలో వీరు పాల్గొన్నారు. ప్రపంచంలోని ఆరో వంతు జనాభా కల్గిన భారత్‌లో ఔత్సాహిక పారిశ్రామికవేత్తల పాత్ర చాలా కీలకమని విలియం అన్నారు. విలియం దంపతులు టెక్ రాకెట్‌షిప్ అవార్డుల్ని అందచేశారు. మహింద్రా గ్రూపు రూ పొందించిన సిమ్యులేటింగ్ ఫార్ములా కారునుయువరాజు నడిపారు. దోసె మిషన్‌పై దోసె వేసి రుచి చూశారు. మంగళవారం ఈ జంటకు ప్రధాని నరేంద్ర  మోదీ విందు ఇవ్వనున్నారు.

మరిన్ని వార్తలు