'తరంగాల'ను కనిపెట్టిన శాస్త్రవేత్తల్లో 37 మంది మనోళ్లే!

12 Feb, 2016 21:07 IST|Sakshi
'తరంగాల'ను కనిపెట్టిన శాస్త్రవేత్తల్లో 37 మంది మనోళ్లే!

విఖ్యాత శాస్త్రవేత్త ఐన్‌స్టీన్ ప్రతిపాదించిన, వందేళ్లకు పైగా మిస్టరీగా ఉన్న గురుత్వాకర్షణ తరంగాలను శాస్త్రవేత్తలు గురువారం కనుగొన్న విషయం తెలిసిందే. ఈ పరిశోధనల్లో పాల్గొన్న వారిలో 37 మంది భారత సంతతికి చెందిన శాస్త్రవేత్తలు ఉండడం గమనార్హం. సుమారు దశాబ్దం కిందటే పుణెలోని ఇంటర్ యూనివర్సీటీ ఫర్ ఆస్ట్రనమీ, ఆస్ట్రోఫిజిక్స్‌కి చెందిన  సంజీవ్‌దురందర్, సత్యప్రకాశ్ అనే ఇద్దరు శాస్త్రవేత్తలు గురుత్వాకర్షణ తరంగాలను గుర్తించే పద్ధతిని కనుగొన్నారు.

 

ఈ ప్రయోగంలో  పుణె,ముంబై,బెంగళూరుకి చెందిన సుమారు 30 మంది శాస్త్రవేత్తలు పాలుపంచుకున్నారు. సుమారు రూ.వెయ్యి కోట్లతో గురుత్వాకర్షణ తరంగాలపై పరిశోధనల నిమిత్తం ‘లేజర్ ఇన్‌ఫర్మేషన్ గ్రావిటేష్నల్ వేవ్ అబ్సర్‌వేటరీ’ (లిగో)ని భారత్‌లో ఏర్పాటు చేయనున్నారు. దీన్ని భారత్, అమెరికా సమ్యుక్తంగా నిర్వహించనున్నారు. అమెరికా 140 మిలియన్ డాలర్ల విలువైన పరికరాలను సమకూర్చనుంది. ప్రయోగంలో భాగస్వామ్యులైనా భారత శాస్త్రవేత్తలకు ప్రధాని నరేంద్రమోదీ ట్విట్టర్‌లో శుభాకాంక్షలు తెలిపారు.

>
మరిన్ని వార్తలు