కట్నంగా 1001 మొక్కలు

26 Jun, 2018 02:48 IST|Sakshi

కేంద్రపర (ఒడిషా): ఒడిషాలోని కేంద్రపర జిల్లాలో ఓ ప్రకృతి ప్రేమికుడు కట్నానికి బదులుగా 1001 మొక్కలు అమ్మాయి తల్లిదండ్రుల నుంచి అందుకున్నాడు. 33 ఏళ్ల సరోజ్‌కాంత బిశ్వాల్‌ అనే ఈ స్కూల్‌ టీచర్‌ ఈ విధంగా ప్రకృతిపై తన ఇష్టాన్ని చాటుకున్నాడు. కట్నానికి తాను బద్ధ వ్యతిరేకినని, దానికి బదులుగా తనకు ఈ పండ్ల మొక్కలు ఇవ్వాలని వధువు తరఫు వారిని కోరినట్లు బిశ్వాల్‌ చెప్పారు. శనివారం ఆయన వివాహం జరిగింది. బిశ్వాల్‌ వివాహం టపాసులు కాల్చడం లాంటి ఆడంబరాలు లేకుండా జరిగిందని వధువు గ్రామస్తులు చెప్పారు. కట్నం నిరాకరించి, ఇలా మొక్కలు తీసుకోవడం తన భార్య రష్మిరేఖకు చాలా సంతోషం కలిగించిందని బిశ్వాల్‌ చెప్పారు. రష్మిరేఖ కూడా ఉపాధ్యాయురాలే.

మరిన్ని వార్తలు