5న  కక్ష్యలోకి జీఐశాట్‌–1

3 Mar, 2020 04:33 IST|Sakshi
జీఐశాట్‌–1 ఉపగ్రహం

ఎంఆర్‌ఆర్‌ ఆధ్వర్యంలో నేడు జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌–10 లాంచ్‌ రిహార్సల్స్‌ 

బుధవారం మధ్యాహ్నం 3.43 గంటలకు కౌంట్‌డౌన్‌  

గురువారం సాయంత్రం 5.43 గంటలకు ప్రయోగం 

సూళ్లూరుపేట: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సతీష్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) నుంచి జియో సింక్రోనస్‌ లాంచింగ్‌ వెహికల్‌ (జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌–10) ఉపగ్రహ వాహక నౌక ద్వారా జీఐశాట్‌–1 ఉపగ్రహాన్ని రోదసిలోకి పంపేందుకు ఏర్పాట్లు తుదిదశకు చేరుకున్నాయి. షార్‌లోని రెండో ప్రయోగ వేదిక నుంచి గురువారం సా.5.43 గంటలకు దీనిని రోదసిలోకి పంపుతారు. దేశరక్షణ వ్యవస్థకు, విపత్తుల  సమాచారాన్ని ముందుగా తెలుసుకోవడమే జీశాట్‌–1 ముఖ్యోద్దేశం. ఈ రిమోట్‌ సెన్సింగ్‌ శాటిలైట్‌ను మొట్టమొదటి సారిగా భూస్థిర కక్ష్యలోకి పంపిస్తున్నారు.  

ప్రయోగమిలా... 
మంగళవారం :  ఎంఆర్‌ఆర్‌ (మిషన్‌ రెడీనెస్‌ రివ్యూ) కమిటీ ఆధ్వర్యంలో లాంచ్‌ రిహార్సల్స్‌ 
బుధవారం : బ్రహ్మప్రకాష్‌ హాలులో ఎంఆర్‌ఆర్‌ చైర్మన్‌ బీఎన్‌ సురేష్, కాటూరి నారాయణ  ఆధ్వర్యంలో మిషన్‌ సంసిద్ధత సమావేశం. అనంతరం మూడు దశల రాకెట్‌ అనుసంధానం.  తర్వాత తుదివిడత పరీక్షలు. లాంచ్‌ ఆ«థరైజేషన్‌ బోర్డు (ల్యాబ్‌)కు అప్పగింత.  
బుధవారం సాయంత్రం : ల్యాబ్‌ చైర్మన్‌ ఆర్ముగం రాజరాజన్‌ ఆధ్వర్యంలో రిహార్సల్స్‌. సా.3.43 గంటలకు కౌంట్‌డౌన్‌ ప్రారంభం. ఆ వెంటనే రెండో దశలో 42.21 టన్నుల ద్రవ ఇంధనాన్ని నింపే ప్రక్రియ ప్రారంభం. 
గురువారం : సాయంత్రం 5.43 గంటలకు నింగిలోకి దూసుకుపోనున్న జీఎస్‌ఎల్‌వీ. భూస్థిర కక్ష్యలోకి జీఐశాట్‌ – 1.  

>
మరిన్ని వార్తలు