రిటర్నుల ఫైలింగ్‌ సులభతరమే ఎజెండా!

18 Jan, 2018 05:32 IST|Sakshi

నేడు జీఎస్టీ మండలి సమావేశం

న్యూఢిల్లీ: రిటర్నుల ఫైలింగ్‌ను సులభతరం చేయడం, ఈ–వే బిల్లుల జారీకి జీఎస్టీ నెట్‌వర్క్‌ సన్నద్ధతను సమీక్షించడమే ప్రధాన అజెండాగా జీఎస్టీ మండలి సమావేశం గురువారం జరగనుంది. బడ్జెట్‌ సమర్పణకు ముందు నిర్వహిస్తున్న ఈ భేటి 25వది కావడం గమనార్హం. జీఎస్టీ రేట్లను తగ్గించాలని పలు వర్గాల నుంచి వచ్చిన విన్నపాలను కూడా మండలి పరిశీలించే అవకాశాలున్నాయి.

ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ నేతృత్వంలో జరిగే ఈ సమావేశంలో సుమారు 70 వస్తువులపై జీఎస్టీ రేట్లను తగ్గిస్తూ కీలక నిర్ణయం వెలువడుతుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. జనవరి 29 నుంచి జరిగే పార్లమెంట్‌ సమావేశాల్లో చర్చించేందుకు వీలుగా జీఎస్టీ చట్టంలో సవరణలకు మండలి ఆమోదం తెలపొచ్చని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

మరిన్ని వార్తలు