జీఎస్టీ : గందరగోళాలపై క్లారిటీ

30 Jun, 2017 10:56 IST|Sakshi
జీఎస్టీ : గందరగోళాలపై క్లారిటీ
ఇంకాకొన్ని గంటల్లో పార్లమెంట్‌ సెంట్రల్‌ వేదికగా జీఎస్టీ అమలు కాబోతుంది. ఈ నేపథ్యంలో కొత్త పన్ను విధానంపై వస్తున్న గందరగోళాలపై ఆర్థికమంత్రిత్వ శాఖ రెవెన్యూ సెక్రటరీ హస్ముఖ్‌ అధియా క్లారిటీ ఇచ్చారు. టెక్నాలజీకల్‌ గా, ఆర్థికంగా జీఎస్టీ ఎంతో అద్భుతమైనదని చెప్పారు. ఎలాంటి తప్పుడు సమాచారాన్ని ప్రజలు నమ్మవద్దని అధియా సూచించారు. అయితే జీఎస్టీ కింద నెలకు నాలుగు రిటర్న్స్‌లను రిటైలర్లు దాఖలు చేయాల్సి  ఉందని మార్కెట్లో ఊహాగానాలు వస్తున్నాయని, అవన్నీ నిజం కాదని పేర్కొన్నారు. నెలకు కేవలం ఒక్క రిటర్న్‌ దాఖలు చేస్తే సరిపోతుందని తెలిపారు. మిగతా రెండింటిని కంప్యూటర్‌ చేస్తుందని చెప్పారు.
 
కంపోజిట్‌ రిటైలర్లు కూడా ప్రతినెలా రిటర్న్‌ దాఖలు దాఖలు చేయాల్సినవసరం లేదని, ప్రతి మూడు నెలలకు ఓ సారి దాఖలు చేస్తే కూడా సరిపోతుందని చెప్పారు. అదీ కూడా మొత్తం టర్నోవర్‌ వివరాలు మాత్రమేనన్నారు. జీఎస్టీ అమలుకు పెద్ద ఐటీ ఇన్ఫ్రా కూడా అవసరం లేదన్నారు. ''బిజినెస్‌ టూ బిజినెస్‌(బీ టూ బీ) లావాదేవీలకు కూడా పెద్ద సాఫ్ట్‌ వేర్‌ అక్కర్లేదని చెప్పిన అధియా, తాము ఉచితంగా సాఫ్ట్‌వేర్‌ కూడా అందించనున్నట్టు వెల్లడించారు. అదనంగా బీ టూ బీ లావాదేవీలకు ఎక్స్‌ఎల్‌ ఫార్మాట్‌ను ఇవ్వనున్నట్టు తెలిపారు. దీంతో ప్రతినెలా 10న ఇన్‌వాయిస్‌ వివరాలను అప్‌డేట్‌ చేయడానికి, అప్‌లోడ్‌ చేయడానికి వీలుంటుందన్నారు. పన్నులను సక్రమంగా చెల్లించే వారికి ఇది ఎంతో లబ్దిదాయకమని చెప్పారు.   
 
మరిన్ని వార్తలు