షూటింగులకు మార్గదర్శకాలు

8 Jul, 2020 01:48 IST|Sakshi

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ విస్తరిస్తున్న వేళ దాని నుంచి తప్పించుకుంటూనే సినిమాలను చిత్రీకరించేందుకు అవసరమైన ప్రత్యేక మార్గదర్శకాలను (స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్‌) ప్రభుత్వం తీసుకురానుందని కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జవడేకర్‌ చెప్పారు. ఎఫ్‌ఐసీసీఐ ఫ్రేమ్స్‌ 2020 కార్యక్రమాన్ని మంగళవారం వర్చువల్‌గా ప్రారంభించిన ఆయన ఈ విషయం తెలిపారు. షూటింగులను ప్రోత్సహించేందుకు ప్రత్యేక ప్రోత్సాహకాలతో ప్రభుత్వం ముందుకు రానుందని చెప్పారు. టీవీ సీరియళ్లు, సినిమాలు, కో ప్రొడక్షన్, యానిమేషన్, గేమింగ్‌ వంటి రంగాల్లో ప్రోత్సాహకాలు అందించనున్నట్లు వెల్లడించారు. దేశంలో చిత్రీకరిస్తున్న సినిమాలను 150 దేశాల్లో చూస్తున్నారన్నారు. సినీ పరిశ్రమ ప్రముఖులు, సీనియర్లు తమ ఆలోచనలు పంచుకునేందుకు ఈ నెల 11 నుంచి ప్రారంభం కానున్న ఎఫ్‌ఐసీసీఐ ఫ్రేమ్స్‌ 2020 వేదిక కానుంది. కరోనా కారణంగా ఈ ఏడాది ఈ కార్యక్రమాన్ని వర్చువల్‌గా నిర్వహించనున్నారు.

మరిన్ని వార్తలు