‘రాఖీ విత్‌ ఖాకీ’కి గిన్నిస్‌ గుర్తింపు

3 Dec, 2018 10:26 IST|Sakshi

రాయ్‌పూర్‌: ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌ పోలీసులు చేపట్టిన వినూత్న కార్యక్రమం ‘రాఖీ విత్‌ ఖాకీ’కి గిన్నిస్‌ బుక్‌ గుర్తింపు లభించింది. ఆగస్టు 25న నిర్వహించిన ఈ కార్యక్రమంలో భాగంగా కేవలం పది గంటల వ్యవధిలోనే సుమారు 50 వేల మంది మహిళలు, బాలికలతో పోలీసులకు రాఖీలు కట్టించారు. అందుకు సంబంధించిన ఫొటోల్ని సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్‌ చేశారు.

ఈ రికార్డును గుర్తిస్తూ శనివారం గిన్నిస్‌ బుక్‌ నుంచి సర్టిఫికేట్‌ అందుకున్నట్లు బిలాస్‌పూర్‌ పోలీసులు వెల్లడించారు. మహిళల భద్రతకు హామీ ఇస్తూ వారితో పోలీసులకు రాఖీలు కట్టించాలనే ఆలోచన బిలాస్‌పూర్‌ ఎస్పీ షేక్‌ ఆరిఫ్‌ హుసేన్‌కు వచ్చింది.  

మరిన్ని వార్తలు