నేపాల్ పునరుద్ధరణకోసం..

22 Jun, 2016 19:52 IST|Sakshi
నేపాల్ పునరుద్ధరణకోసం..

భూకంపంతో నేలమట్టమైన నేపాల్ ను పునరుద్ధరించేందుకు  ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని కేబినెట్ అప్పాయింట్ మెంట్ కమిటీ (ఏసీసీ) తాజాగా నేషనల్ రీ కనస్ట్రక్షన్ అథారిటీ ప్యానెల్ లో సీనియర్ అడ్వైజర్ గా గుజరాత్ కేడర్ కు చెందిన ఐఏఎస్ ఆఫీసర్ వి. తిరుప్పుగహ్ ను నియమించింది. గతేడాది నేపాల్ లో సంభవించిన భూకంపం అక్కడి ప్రజల్ని భారీ వినాశనంలోకి నెట్టివేసిన సంగతి తెలిసిందే. ఆ ప్రకృతి విలయం తొమ్మిది వేలకు పైగా ప్రాణాలుకూడా బలిగొంది.

గుజరాత్ కేడర్ కు చెందిన ఐఏఎస్ ఆఫీసర్ తిరురుప్పుగహ్ 1991 బ్యాచ్ కు చెందినవాడు. ప్రస్తుతం నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీలో పనిచేస్తున్న ఆయన్ను.. నేషనల్ రీ కనస్ట్రక్షన్ అథారిటీ (ఎన్ ఆర్ ఏ) లో మొదటి ఆర్నెల్లకు సీనియర్ అడ్వైజర్ గా నియమిస్తూ ప్రభుత్వ పర్సనల్ అండ్ ట్రైనింగ్ డిపార్ట్ మెంట్ ఆదేశాలు జారీ చేసింది. గతేడాది ఏప్రిల్ 25న భూకంపం సుమారు 9 వేలమందిని పొట్టన పెట్టుకొని, 22,302 మందిని గాయాల పాలు చేసి, కోట్టాది రూపాయల నష్టాన్ని చేకూర్చిన అనంతరం.. నేపాల్ పునరుద్ధరణకోసం ఎన్ ఆర్ ఏ ను ఏర్పాటు చేశారు. ఆరు నెల్లపాటు తిరుప్పగహ్న ఆ బాధ్యతల్లో కొనసాగుతారు.

అలాగే మరో ఐఏఎస్ ఆఫీసర్ ప్రశాంత్ ఎస్ లోకాండే ను బీజింగ్ లోని ఇండియన్ ఎంబసీలో కౌన్సిలర్ గా నియమిస్తూ ఏసీసీ ఆదేశాలు జారీ చేసింది. 2001 బ్యాచ్ యూనియన్ టెర్రిటరీస్ కు చెందిన ఐఏఎస్ ఆఫీసర్ లోకాండేను మొదట్లో మూడేళ్ళకోసం నియమించినట్లు ఏసీసీ తెలిపింది. ప్రస్తుతం లోకాండే పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ మంత్రిత్వ శాఖలో పనిచేస్తున్నారు.

మరిన్ని వార్తలు