సైకిళ్లపై 258 మంది పెళ్లి కొడుకులు

7 Nov, 2016 18:23 IST|Sakshi
సైకిళ్లపై 258 మంది పెళ్లి కొడుకుల సవారీ

సూరత్‌: దేశ రాజధాని ఢిల్లీ, సూరత్‌ సహా దేశంలోని పలు ఉత్తర, మధ్య భారత నగరాలను తీవ్ర వాయు కాలుష్యం కమ్ముకున్న నేపథ్యంలో ప్రజల్లో చైతన్యం తీసుకరావడానికిగాను సూరత్‌లో సోమవారం 258 మంది పెళ్లి కొడుకులు బంధు, మిత్రుల సపరివారం తోడురాగా సైకిళ్లు తొక్కుకుంటూ పెళ్లి మంటపానికి చేరుకున్నారు. సాధారణంగా పెళ్లి కొడుకులు గుర్రాలపై, కార్లలో ఓ బరాత్‌లాగా పెళ్లి మంటపానికి చేరుకుంటారు. అందుకు భిన్నంగా ఈకో ఫ్రెండ్లీగా సైకిళ్లపై స్వారీ చేస్తూ వచ్చారు.

ఇంతమంది పెళ్లి కుమారులు ఒకరోజు ఒకేచోట కలవడానికి కారణం ‘సౌరాష్ట్ర పటేల్‌ సేవా సమాజ్‌’ సామూహిక వివాహాలను ఏర్పాటు చేయడమే. ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో సౌరాష్ట్ర భవన్‌ నుంచి ప్రారంభమైన పెళ్లి కుమారుల సైకిళ్ల యాత్ర లోక్‌సమర్పన్‌ రక్తదాన్‌ కేంద్ర వద్ద ముగిసింది. దేశంలోని అన్ని స్మార్ట్‌ నగరాల్లో సైకిళ్ల వినియోగాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, అందులో భాగంగానే తమ సంస్థ ఈ యాత్రను ఏర్పాటు చేసిందని సౌరాష్ట్ర పటేల్‌ సేవా సమాజ్‌ అధ్యక్షులు కంజి బలాల మీడియాతో వ్యాఖ్యానించారు.

>
మరిన్ని వార్తలు