అమ్మమ్మ వయసులో నాలుగు గోల్డ్‌ మెడల్స్‌..!

31 Jan, 2020 12:05 IST|Sakshi

గాంధీనగర్‌: చదువుకు శ్రద్ధ ఉంటే చాలు.. వయసుతో పనిలేదని నిరూపించింది ఓ మహిళ. ఏకంగా 55 ఏళ్ల వయసులో మరోసారి పుస్తకాలు పట్టుకొని కాలేజీ క్యాంపస్‌లో అడుగు పెట్టింది. లేటు వయసుసలో న్యాయవాద కోర్సును పూర్తి చేయడమే కాకుండా ఏకంగా నాలుగు గోల్డ్ మెడల్స్ కూడా సాధించి అందరిని ఔరా అనిపించింది. గుజరాత్‌కు చెందిన నీతి రావల్ అనే మహిళ సాధించిన ఈ అరుదైన ఘనత ఇప్పుడు సంచలనంగా మారింది.  (ఒక్క గంటలో ఆయన సంపాదన రూ. 16వేల కోట్లు)

నీతీ రావల్‌కు 30 ఏళ్ల క్రితం మౌలిన్ రావల్ అనే వ్యాపారితో వివాహం అయింది. ఆమెకు ఒక కూతురు, ఒక కొడుకు. కూతురికి పెళ్లయింది. కొడుకు లాయర్‌గా స్థిరపడ్డాడు. ఏళ్లుగా కుటుంబ బాధ్యతలను మోసిన నీతి రావల్‌కి ఇంట్లో ఒంటరిగా ఉండడం నచ్చలేదు. ఏదైనా కొత్తగా చేయాలనుకుంది. ఎవరేం అనుకున్నా పర్వాలేదని 30 ఏళ్ల తర్వాత మళ్లీ కాలేజీకి వెళ్లింది. తన కుటుంబం సాయంతో గుజరాత్ యూనివర్సిటీ నుంచి లా కంప్లీట్ చేసింది. ఇటీవల జరిగిన కాన్వొకేషన్ డేలో 4 గోల్డ్ మెడల్స్ అందుకొని అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది.

ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఆమెలో ఉన్న ఆసక్తి చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. కాగా నీతీ రావల్ ఇంతటితో ఆగిపోవడం లేదు. త్వరలోనే మాస్టర్ ఇన్ లా అడ్మిషన్  కూడా పూర్తి చేస్తానని చెప్తోంది. నీతి రావల్ మాట్లాడుతూ.. నాకు ఒక్క దానికే ఇంట్లో ఏం చేయాలో తోచలేదు. అందుకే ఏదైనా చేయాలని అనుకొని లా పూర్తి చేసినట్టు తెలిపారు. ఆమె భర్త మౌలిన్ రావల్ మాట్లాడుతూ.. పెళ్లయిన 30 ఏళ్ల తర్వాత ఈ ఘనత సాధించినందుకు చాలా ఆనందంగా ఉందన్నారు.

టెక్‌ దిగ్గజం ఐబీఎం సీఈఓగా మనోడే..!

మరిన్ని వార్తలు