సీతను అపహరించింది రాముడేనట..!!

1 Jun, 2018 14:11 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

గాంధీనగర్‌ : పన్నెండో తరగతి ఆంగ్ల మాధ్యమ విద్యార్థుల కోసం గుజరాత్‌ బోర్డు ముద్రించిన సంస్కృత పాఠ్య పుస్తకం తప్పుల తడకగా ఉండటంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘సంస్కృత సాహిత్య పరిచయం’  పేరిట అచ్చైన పుస్తకంలో..‘రాముని వ్యక్తిత్వం, గొప్పతనం, ఆయన ఆలోచనల గురించి రచయిత ఎంతో గొప్పగా వర్ణించారు. రాముడు సీతను అపహరించిన సమయంలో లక్ష్మణుడు.. సీత అపహరణ గురించి రామునికి సమాచారం చేరవేసే పద్య వర్ణన ఎంతో హృద్యంగా ఉంటుంది’  అంటూ పరిచయ వాక్యాలు రాశారు. అంతేకాకుండా పుస్తకంలో ఎన్నో అక్షర దోషాలు కూడా ఉన్నట్లుగా ఫిర్యాదులున్నాయి.

అనువాద దోషం వల్లే అలా..
పాఠ్య పుస్తకంలో తప్పులు దొర్లిన విషయంపై గుజరాత్‌ స్టేట్‌ బోర్డ్‌ ఆఫ్‌ స్కూల్‌ టెక్ట్స్ బుక్‌ ఎగ్జిక్యూటివ్‌ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ నితిన్‌ పేతాని స్పందించారు. గుజరాతి పుస్తకంలో సరిగ్గానే ఉందని, అనువాద సమయంలో జరిగిన పొరపాటు కారణంగానే ఈ తప్పిదం జరిగిందని వివరణ ఇచ్చారు.

మరిన్ని వార్తలు