పోలీసును ఉతికి ఆరేశారు

30 Dec, 2015 18:34 IST|Sakshi
పోలీసును ఉతికి ఆరేశారు

వడోదర: ట్రాఫిక్ పోలీసుపై వడోదర ప్రజలు కన్నెర్ర జేశారు. మిగతా పోలీసులు వచ్చినా అతడిని కాపాడలేకపోయారు. గుజరాత్ లోని వడోదరలో మంగళవారం సాయంత్రం చోటుచేసుకున్న ఈ ఘటన సంచలనం రేపింది. బైకు వెళుతున్న ముగ్గురిని కానిస్టేబుల్ శాంతిలాల్ పార్మర్ ఆపాడు. అతడు తమను లాఠీతో కొట్టాడని ఆరోపిస్తూ కానిస్టేబుల్ పై వారు దాడికి దిగారు. దాదాపు 40 మందిపోగై అతడిని చితకొట్టారు.

మరో ముగ్గురు పోలీసులు అతడిని కాపాడేందుకు జీపులోకి ఎక్కించారు. జీపులోంచి బయటకు లాగి మరోసారి దాడికి పాల్పడ్డారు. పోలీసుల బైకును తగులబెట్టారు. ఇదంతా వీడియోలో రికార్డైంది. తాము లాఠీ ఝుళిపించలేదని, రోడ్డు డివైడర్ గుద్దుకుని బైకుపై వెళుతున్న వారు పడిపోయారని పోలీసులు తెలిపారు. వీడియో ఫుటేజీ ఆధారంగా దాడి చేసిన వారిని గుర్తిస్తున్నామని, ఒకరిని అరెస్ట్ చేశామని చెప్పారు.

మరిన్ని వార్తలు