ఈ ఎన్నికలు మోదీకి పరీక్షే!?

28 Oct, 2017 12:07 IST|Sakshi

సాక్షి, ముంబై : గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ శాసనసభ ఎన్నికలు మోదీ ఆర్థిక సంస్కరణలకు లిట్మస్‌ పరీక్ష అని సింగపూర్‌ లీడింగ్‌ బ్యాంక్‌ డీబీఎస్‌ పేర్కొంది. మోదీ ప్రజాదరణకు, పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీని ప్రజలు ఆదరించారని చెప్పడానికి ఈ ఎన్నికల ఫలితాలను నిదర్శనంగా తీసుకోవచ్చని డీబీఎస్‌ బ్యాంక్‌ స్పష్టం చేసింది. గూడ్స్‌ అండ్‌ సర్వీసెస్‌ ట్యాక్స్‌ను అమలు చేయడం వల్ల గుజరాత్‌లో వ్యాపారాలు మందగించాయనేది వాస్తవం.. అదే సమయంలో కులాల గొడవలు.. బీజేపీకి పరీక్షలు పెడుతున్నాయని డీబీఎస్‌ తెలిపింది.

నరేంద్ర మోదీ ప్రభుత్వం అమలు చేసిన ఆర్థిక సంస్కరణలకు దేశానికి ముఖ్యమా? లేక అనవసరమా అన్నది ఈ రెండు రాష్ట్రాల ఫలితాలతో తేలిపోతుందని డీబీఎస్‌ తెలిపింది. 2019 లోక్‌సభ ఎన్నికల ఫలితాలకు వీటిని సంకేతాలు కూడా భావించవచ్చని పేర్కొంది.

మరిన్ని వార్తలు