కానిస్టేబుల్‌‌కు యావత్తు దేశం సెల్యూట్

11 Aug, 2019 11:17 IST|Sakshi

గాంధీ నగర్‌: విధి నిర్వహణలో ప్రాణాలను పణంగా పెట్టి ఇద్దరు చిన్నారులను కాపాడిన ఓ కానిస్టేబుల్‌‌కు దేశం యావత్తు సెల్యూట్ చేస్తోంది. ఈ ఘటన గుజరాత్‌లో చోటుచేసుకుంది. భారీ వర్షాలతో గుజరాత్ అతలాకుతమవుతోన్న విషయం తెలిసిందే. లోతట్టు ప్రాంతాల్లో చిక్కుకున్న బాధితులను రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, పోలీసులు, ఎయిర్‌ పోర్స్‌ సిబ్బంది రంగంలోకి దిగారు. వరదప్రభావిత ప్రాంతాల్లో సహాయకచర్యలను ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో అలా వెళ్లిన సిబ్బందికి వరదలో చిక్కుకోని ఓ చోట ఇద్దరు చిన్నారులు కనిపించారు.

నీళ్లల్లో చిక్కుకుని తీవ్ర భయాందోళనతో ఉన్నవారిని.. పోలీస్ కానిస్టేబుల్ పృథ్విరాజ్ సింగ్ జడేజా తన భుజాలపైకి ఎత్తుకుని.. వరదనీటిలో నడుచుకుంటూ గట్టుకు చేర్చారు. ఈ దృశ్యాన్ని అక్కడే ఉన్న ఓ వ్యక్తి తన మొబైల్‌లో చిత్రీకరించారు. ఈ విషయం గుజరాత్ సీఎం విజయ్ రూపానీ దృష్టికి వెళ్లగా.. ఆ కానిస్టేబుల్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. ట్విట్టర్‌లో వీడియోను అప్‌లోడ్ చేసిన సీఎం.. ‘‘ప్రతికూల పరిస్థితుల్లోనూ కఠినశ్రమ, సంకల్పం, అంకితభావాలతో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులకు పృథ్విరాజ్ ఓ ఉదాహరణగా నిలుస్తున్నారు. వారి నిబద్ధతను అభినందించండి’’ అంటూ ట్వీట్ చేశారు. ఆయనపై సోషల్‌ మీడియాలో అభినందనలు వెల్లువెత్తుత్తున్నాయి.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా