అహ్మదాబాద్‌లో 700 మంది సూపర్‌ స్ప్రెడర్స్‌

17 May, 2020 06:40 IST|Sakshi

న్యూఢిల్లీ: అహ్మదాబాద్‌లో నిత్యావసర సరుకులు, కూరగాయలు అమ్ముకునేవారికి వారం రోజుల పాటు భారీ స్థాయిలో కోవిడ్‌ పరీక్షలు జరపగా, వారిలో 700 మంది ‘సూపర్‌స్ప్రెడర్స్‌’(వైరస్‌ను విస్తృతంగా వ్యాపింపజేసేవారు) ఉన్నారని అధికారులు గుర్తించారు. మే 7 నుంచి 14 వరకు పాలు, మందుల షాపులు మినహా మిగిలిన షాపులన్నింటినీ మూసివేసి, ఈ పరీక్షలు జరిపారు. వైరస్‌ వ్యాప్తికి కారణమని భావిస్తున్న కూరగాయలు, నిత్యావసరాలు, పాలు అమ్మేవారు, పెట్రోల్‌ బంకుల్లో పనిచేసేవారు, చెత్త ఏరుకునే వారిని ‘సూపర్‌ స్ప్రెడర్స్‌’గా గుర్తించారు. గత వారం రోజుల్లో 33,500 మందిని స్క్రీనింగ్‌ చేసి, అందులో 12,500 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. వారిలో 700 మందికి కోవిడ్‌ పాజిటివ్‌ రావడంతో ఐసోలేషన్‌లో ఉంచినట్టు అహ్మదాబాద్‌ కోవిడ్‌ బాధ్యతలు నిర్వర్తిస్తోన్న అడిషనల్‌ చీఫ్‌ సెక్రటరీ రాజీవ్‌ వెల్లడించారు.

మరిన్ని వార్తలు